Type Here to Get Search Results !

Sports Ad

ఇవాళ్టి (జూన్ 14) నుంచి డీఈఈసెట్ వెబ్ ఆప్షన్లు 20న సీట్ల కేటాయింపు Seat allocation on DEECET web options 20 from today (June 14)

ఇవాళ్టి (జూన్ 14) నుంచి డీఈఈసెట్ వెబ్ ఆప్షన్లు 20న సీట్ల కేటాయింపు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 14 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని డీఈఈసెట్ కన్వీనర్ రమేశ్ తెలిపారు.

 జూన్ 17 వరకూ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉందన్నారు. ఈ నెల 20న కాలేజీల్లో సీట్లను అలాట్ చేయనున్నట్టు చెప్పారు. సీట్లు అలాటైన విద్యార్థులు జూన్ 21 నుంచి 24 వరకూ ట్యూషన్ ఫీజు చెల్లించి, కాలేజీ అలకేషన్ లెటర్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 

 జులై 1 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఈ నెల 9 నుంచి 13 వరకూ సర్కారు డైట్ కాలేజీల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయిందని చెప్పారు. మరిన్ని వివరాలకు https://deecet.cdse.telangana.gov.in వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ చూడాలని సూచించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies