Type Here to Get Search Results !

Sports Ad

హైదరాబాద్ లో స్టూడెంట్ల​ కోసం 100 కొత్త బస్సులు జూన్ నుంచి అందుబాటులోకి తేనున్న ఆర్టీసీ RTC To Make 100 New Buses Available For Students In Hyderabad From June

హైదరాబాద్ లో స్టూడెంట్ల​ కోసం 100 కొత్త బస్సులు జూన్ నుంచి అందుబాటులోకి తేనున్న ఆర్టీసీ

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : గ్రేటర్​పరిధిలో వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి అదనంగా మరో 100 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గ్రేటర్​ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గ్రేటర్​పరిధిలో రోజు రోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. వీరి కోసం ఆర్టీసీ ప్రస్తుతం 2800 బస్సులను నడుపుతోంది. 

 ఇందులో 250 వరకు ఎలక్ట్రిక్​ బస్సులున్నాయి. దాదాపు 150 వరకు ఎలక్ట్రిక్​ నాన్ ఏసీ బస్సులను వివిధ రూట్లలో నడుపుతుండగా, 49 బస్సులు ఎయిర్​ పోర్ట్​ రూట్లలో, మరికొన్ని అవసరం ఉన్న రూట్లలో నడిపిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 100 ఎలక్ట్రిక్​ బస్సులను తీసుకురాబోతున్నట్టు అధికారులు చెప్తున్నారు. 

విద్యాసంస్థలకు లెటర్లు...
గ్రేటర్​శివారు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లోనే వచ్చి వెళ్తుంటారు. దీంతో వీరి అవసరాలకు అనుగుణంగా బస్సులను పెంచబోతున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఎక్కడెక్కడి ప్రాంతాల్లో స్టూడెంట్స్​కు బస్సు సౌకర్యం అవసరమో చెప్పాలంటూ ఆయా విద్యాసంస్థల మేనేజ్​మెంట్లకు ఆర్టీసీ అధికారులు లెటర్లు రాస్తున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies