Type Here to Get Search Results !

Sports Ad

జూన్ నెలలో 12 రోజులు బ్యాంక్ సెలవులు ఆ పనులుంటే అప్రమత్తం Be Alert For 12 Bank Holidays In June

జూన్ నెలలో 12 రోజులు బ్యాంక్ సెలవులు ఆ పనులుంటే అప్రమత్తం

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజలకు రోజువారీ జీవితంలో నిత్యవసర వస్తువుగా మారిపోయింది. పెట్టుబడుల నుంచి రుణాల వరకు, డబ్బు ట్రాన్సాక్షన్ల నుంచి దాచుకోవటం వరకు అనేక అవసరాలను ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం తీరుస్తోంది. ఒక్క గంట బ్యాంకులు పనిచేయకటం ఆగిపోతే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. అయితే జూన్ మాసంలో రిజర్వు బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం బ్యాంకులు దాదాపు 12 రోజులు సెలవులో ఉండనున్నాయని తెలుస్తోంది.

 అయితే సెలవులు వివిధ రాష్ట్రాల్లో స్థానిక పండుగలకు అనుగుణంగా ఉంటాయి. వీటికి అదనంగా వారాంతపు సెలవులు, రెండవ నాల్గవ శనివారం సెలవులు కూడా జోడించబడ్డాయి. 

జూన్ 2025లో బ్యాంగ్ సెలవుల జాబితా..
* జూన్ 6, 2025: బక్రీద్ సందర్భంగా కేరళలో బ్యాంకులకు సెలవు
* జూన్ 7, 2025: బక్రీద్ సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
* జూన్ 11, 2025: గురు కబీర్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్, సిక్కింగ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
* జూన్ 27, 2025: రథయాత్ర సదర్భంగా ఒడిశా, మణిపూర్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
* జూన్ 30, 2025: రెమ్మాని సందర్భంగా మిజోరామ్ లో బ్యాంకులకు హాలిడే
బ్యాంక్ సెలవు రోజుల్లో కూడా సాధారణ చెల్లింపుల లావాదేవీలు చేసుకోవటానికి బ్యాంకింగ్ హాలిడేస్ ఎలాంటి అవరోధాలను కలిగించదు. ఈ సమయంలో ఖాతాదారులకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి. దీనికి తోడు మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌ ద్వారా, యూపీఐ చెల్లింపు వ్యవస్థ ద్వారా పనులను పూర్తి చేసుకోవచ్చు.

 ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ సైతం అందుబాటులోనే ఉంటుంది. అయితే లోన్స్ కి సంబంధించిన ఏదైనా పనులు ఉన్నట్లయితే అందుకోసం ఖచ్చితంగా బ్యాంక్ శాఖను సందర్శించాల్సి ఉంటుందని మనందరికీ తెలుసు. అందువల్ల సెలవు దినాలు కాని రోజుల్లో మీకు సమీపంలోని బ్యాంక్ బ్రాండ్ సందర్శించి పనులను పూర్తి చేసుకునేందుకు ప్లాన్ చేసుకోవటం ఉత్తమం. ఇది చివరి క్షణాల్లో గందరగోళాన్ని నివారించటానికి దోహదపడుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies