లగ్జరీ ఇల్లు కొన్న అనసూయ గృహ ప్రవేశం ఫోటోలు వైరల్ ఖరీదు ఎంతంటే
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : యాంకర్ కం నటి అనసూయ (AnasuyaBharadwaj) పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు పేక్షకుల్లోనే కాదు సోషల్ మీడియా యూత్ లో కూడా మంచి ఫాల్లోవింగ్ ఉంది. తాను ఏం పోస్ట్ చేసిన ఇట్టే క్షణాల్లో వైరల్ అయ్యేంత ఫాల్లోవింగ్ సంపాదించుకుంది. లేటెస్ట్గా నటి అనసూయ కొత్తింటి ఫోటోలను పంచుకుంది. హైదరాబాద్లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. సోమవారం మే12న తన భర్త, పిల్లలతో కలిసి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. ఈ సందర్భంగా తన ఇంటికి ‘శ్రీరామ సంజీవని’ అనే పేరు పెట్టింది.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘ఆ సీతారామాంజనేయ కృపతో మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో మా జీవితంలోని మరో అధ్యాయం శ్రీరామ సంజీవని మా కొత్తింటి పేరు జై శ్రీరామ్ జై హనుమాన్’అంటూ అనసూయ పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది. తెలుగు సాంప్రదాయం ప్రకారం పాలు పొంగించి నూతన గృహ ప్రవేశం చేసింది. ఇందులో తన భర్త, పిల్లలతో కొత్త ఇంటి ముందు ఫోటలకు పోజులిచ్చింది.
ఇకపోతే, ఈ ఖరీదైన ఇంటి విషయానికి వస్తే కొత్త టెక్నాలజీ ఫీచర్స్ తో డిజైన్ చేయిందంట. దీన్ని ధర సుమారుగా రూ.50 కోట్ల వరకు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే, ధర విషయంలో సరైన క్లారిటీ తెలియాల్సి ఉంది. అనసూయ రేంజ్ కు తగ్గట్టుగా, ఈ ఇంటి కోసం ఖర్చు పెట్టిందని తెలుస్తోంది.
అనసూయ న్యూస్ రీడర్గా కెరీర్ మొదలు పెట్టి, యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అక్కడితో ఆగకుండా నటిగా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. చిన్న, పెద్ద సినిమాల్లో నటిస్తూ మధ్యలో పలు షోలకి జడ్జిగా కూడా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో టాక్ అఫ్ ది యాక్టర్స్గా వైరల్ అవుతుంది.