Type Here to Get Search Results !

Sports Ad

కొండ దిగి వస్తున్న బంగారం ధరలు హైదరాబాద్లో గోల్డ్ రేట్లు ఇలా ఉన్నాయి Gold Prices Are Coming Down The Hill Gold Rates In Hyderabad Are As Follows

కొండ దిగి వస్తున్న బంగారం ధరలు హైదరాబాద్లో గోల్డ్ రేట్లు ఇలా ఉన్నాయి

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : బంగారం చరిత్రలోనే ఆల్ టైమ్ హై లక్ష రూపాయలను దాటి కొండెక్కి కూర్చున్న ధరలు మెల్ల మెల్లగా దిగి వస్తున్నాయి. అంతర్జాతీయంగా టెన్షన్స్ తగ్గుతుండటం సెంట్రల్ బ్యాంకులు నిల్వల కోసం కొనుగోలు తగ్గించడంతో గోల్డ్ రేట్లు మళ్లీ తగ్గుతున్నాయి. దీనికి తోడు భారీగా పెరిగిన ధరలతో సామాన్యులు కొనేందుకు అంతగా ఆసక్తి చూపకపోవడం కూడా ఒక కారణం. ఇన్వెస్టర్లు, సామాన్యులు వేచి చూసే ధోరణి అవలంభిస్తుండటంతో పసిడి ధరలు తగ్గుతున్నాయి. 

శుక్రవారం (మే 2) హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి...
24 క్యారెట్ల 10 గ్రాముల ధర స్వల్పంగా రూ.220 తగ్గటంతో హైదరాబాద్ లో తులం బంగారం విలువ రూ.95,510 వద్ద ఉంది. 
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 200 తగ్గి 87,550 వద్ద ఉంది. 

 బంగారంపై ప్రపంచ మార్కెట్లలో డిమాండ్ కాస్త తగ్గుతుండటమే ఇందుకు కారణం. భౌగోళికంగా ఉన్న ఉద్రిక్తతలు, టారిఫ్ వార్ ల కారణంగా ఇన్నాళ్లు బంగారం సేఫ్ బెట్ గా ఇన్వెస్టర్లు భావించారు. అయితే టారిఫ్ ల విషయంలో ట్రంప్  కాస్త తగ్గడంతో మార్కెట్లలో భయాలు తగ్గడంతో బంగారాన్ని ఎక్కువ మొత్తంలో తగ్గించారు. బ్యాంకులు కూడా ఇప్పటికే గోల్డ్ రిజర్వులు పెంచుకున్నాయి.  దీంతో ఇండియాలో గోల్డ్ రేట్లు మరింతగా తగ్గుతూ వస్తున్నాయి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies