Type Here to Get Search Results !

Sports Ad

హైదరాబాద్ మెట్రో కొత్త ఛార్జీలు ఇలా ఉన్నాయి Hyderabad Metro's New Fares Are As Follows

హైదరాబాద్ మెట్రో కొత్త ఛార్జీలు ఇలా ఉన్నాయి

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఎల్​ అండ్​ టీ సంస్థ  శుభవార్త తెలిపింది  ఇటీవల పెంచిన టికెట్ ధరలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 

 హైదరాబాద్​ మెట్రో ఫేర్ డిస్కౌంట్ 2025 కింద ఈ తగ్గింపు మే 24 శనివారం  నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు ప్రకటించారు.   రీసెంట్​గా పెంచిన ధరల ప్రకారం  కనిష్టంగా రూ. 12.. గరిష్ఠంగా రూ. 75  లు ఉండగా..   సవరించిన ధరల ప్రకారం కనిష్టంగా రూ. 11.. గరిష్ఠంగా రూ. 69  లు రేపటి నుంచి ( మే 24) నుంచి అమల్లోకి వస్తున్నాయి.  

 మెట్రో ధరలు పెంచడంతో ప్రయాణికులు నుంచి వ్యతిరేకత రావడం... టికెట్ ధర తగ్గించాలని డిమాండ్​ రావడంతో ఎల్ అండ్ టి మెట్రో సంస్థ పెంచిన ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 

రేపటి ( మే24)  నుంచి అమలు కానున్న మెట్రో ధరల వివరాలు...
* రెండు కిలోమీటర్ల వరకు 11 రూపాయలు
* 2నుంచి 4 కిలోమీటర్ల వరకు 17 రూపాయలు
* 4నుంచి 6 కిలోమీటర్ల వరకు 28 రూపాయలు
* 6 నుంచి 9 కిలోమీటర్ల వరకు 37 రూపాయలు
* 9నుంచి 12 కిలోమీటర్ల వరకు 47 రూపాయలు
* 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు 51 రూపాయలు
* 15నుంచి 18 కిలోమీటర్ల వరకు 56 రూపాయలు
* 18నుంచి 21 కిలోమీటర్ల వరకు 61 రూపాయలు
* 21 నుంచి 24 కిలోమీటర్ల వరకు 65 రూపాయలు
* 24 నుంచి ఆపై కిలోమీటర్ల కు 69 రూపాయలు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies