నాలుగు రోజుల పాటు వానలే వానలు తెలంగాణలో ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఏపీ, తెలంగాణలో భిన్నమైన వాతావరణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించిది.
మంగళవారం ( మే 27) పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపడనం ఏర్పడి నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతాయి. ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ రోజు ( మే 26) నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించనున్నాయి. దీని ప్రభావంతో వారం రోజులపాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలుల పడతాయని ఐఎండీ హెచ్చరించింది.
ఇక తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఈ నెల 28న ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే నాలుగు రోజుల పాటు ( మే 26 నుంచి) తెలంగాణలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చని పేర్కొంది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మే 27వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ తర్వాత కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని పేర్కొంది. భారీ వర్షాల సూచనతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి.
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్.. వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి.
జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. చాలా చోట్ల గంటలకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.





