Type Here to Get Search Results !

Sports Ad

హైదరాబాద్ జూన్ 23న జాబ్ మేళా ఎక్కడంటే Where is the job fair on June 23rd in Hyderabad

హైదరాబాద్ జూన్ 23న జాబ్ మేళా ఎక్కడంటే

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : వెస్ట్ మారేడ్​పల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కాలేజీలో నేడు ఉదయం 9.30 గంటల నుంచి ఒకేషనల్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల కోసం అప్రెంటిషిప్, జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఒడ్డన్న ఆదివారం తెలిపారు. 

 ఈ మేళాలో పారామెడికల్, నాన్-పారామెడికల్ రంగాలకు సంబంధించిన164 కంపెనీలు పాల్గొంటున్నాయని, మొత్తం 3,153 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. మూడేండ్లలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి అర్హులన్నారు. పూర్తి వివరాలకు 9848781805 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies