Type Here to Get Search Results !

Sports Ad

జూన్ 30వ తేదీ వరకు హైదరాబాదీలు జాగ్రత్త ఏ నిమిషం అయినా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం Hyderabadis should be careful till June 30th, heavy rain with thunder and lightning at any minute

జూన్ 30వ తేదీ వరకు హైదరాబాదీలు జాగ్రత్త ఏ నిమిషం అయినా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : హైదరాబాదీలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ యూనిట్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే మూడు రోజులు అంటే జూన్ 30వ తేదీ వరకు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సిటీలో ఉష్ణోగ్రతలు తగ్గి ఏ నిమిషం అయినా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవచ్చని అంచనా వేసింది. నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ ఏడాది తొందరగానే రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు గత మూడు వారాలుగా స్తబ్దుగా ఉన్నాయి.

 దీంతో రాష్ట్రంలో పెద్దగా వర్షాలు కురవలేదు. రుతు పవనాల్లో కదలిక వచ్చి మళ్లీ యాక్టివ్ కావడంతో హైదరాబాద్‎తో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ మేరకు తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రుతు పవనాలు మళ్లీ ముందుకు కదులుతుండటంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

 ఆదిలాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా ఆదిలాబాద్​ జిల్లా జైనథ్​లో 13.8 సెంటీ మీటర్ల వాన పడింది. అదే జిల్లా తాంసిలో 13.5 సెంటీ మీటర్లు, భోరజ్‎లో 12.6, తలమడుగులో 12.1, ఇచ్చోడలో 11.8, గుడిహత్నూర్‎లో 11.1, బేలలో 10.6, ఆదిలాబాద్‎లో 10.5 సెంటీ మీటర్ల చొప్పున వర్షం కురిసింది.

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 9.8 సెంటీ మీటర్లు, నిజామాబాద్ జిల్లా సాలూరలో 9.1, సిద్దిపేట జిల్లా నారాయణఖేడ్‎లో 9, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్​లో 8.5, నిర్మల్ జిల్లా పెంబిలో 7.7, మెదక్​లో 7.4, సిద్దిపేటలో 7.3 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‎లో కూడా పలు చోట్ల చిరు జల్లులు కురిశాయి. మూన్‎సూన్ యాక్టివ్‎గా మూవ్ అవుతుండటంతో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies