Type Here to Get Search Results !

Sports Ad

హైదరాబాద్ సిటీలో రోజూ రోడ్లపై తిరుగుతున్న వాహనాలు 91 లక్షలు 91 lakh vehicles ply on the roads in Hyderabad city every day

హైదరాబాద్ సిటీలో రోజూ రోడ్లపై తిరుగుతున్న వాహనాలు 91 లక్షలు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : గత ఏడాది వరకు సిటీలో యావరేజ్ స్పీడ్ 17 నుంచి 18 కిలో మీటర్ ఉండేది. ఇప్పుడది 24 నుంచి 25 వరకు పెరిగిందన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎంతో కష్టపడితే ఈ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఒక రోజుకు 91 లక్షల వాహనాలు రోడ్డు‎క్కెతున్నాయని చెప్పారు. రోజుకు 1600 వాహనాలు పెరుగుతున్నాయన్నారు. ఆపరేషన్ రోప్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని.. దాన్ని ఇంకా బలోపేతం చేస్తామన్నారు. వీఐపీ మూమెంట్‎పై ప్రణాళిక బద్దంగా మందుకు పోతున్నామన్నారు.

 సీఎం తన మూమెంట్ సమయంలో ఎక్కువ సమయం ట్రాఫిక్ ఆపవద్దని ఆదేశాలు ఇచ్చారని ఇది మాకు చాలా ఆనందంగా అనిపించిందన్నారు.  హైదరాబాద్‎లో 80 శాతం  సిగ్నల్స్ ఆటో మోడ్‎లో నడుస్తున్నాయని దీని వల్ల ట్రాఫిక్ త్వరగా క్లియర్ అవుతుందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలపై జరిమానాల్లో సంఖ్య ప్రాధాన్యత కాకుండా.. క్వాలిటీ పై దృష్టి పెట్టి ఫైన్లు వేస్తున్నామని చెప్పారు. దీంతో ట్రాఫిక్ జరిమానాలు తగ్గాయని తెలిపారు. 

 హైదరాబాద్ ట్రాఫిక్‎ను డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని, నగరంలో ట్రాఫిక్ వ్యవస్థను మరింత చక్కదిద్దేందుకు గూగుల్ కంపనీ సహాయం తీసుకుంటున్నామని చెప్పారు. గూగుల్ మ్యాప్స్‎తో పాటు టెక్నికల్‎గా కూడా గూగుల్ సపోర్ట్ చేస్తుందని తెలిపారు. నగరంలో ట్రాఫిక్ సిబ్బంది తక్కువగా ఉండడంతో ట్రాఫిక్ మార్షల్ సిస్టంను తీసుకొస్తున్నాం.. కార్పొరేట్ రెస్పాన్స్ బులిటీ కింద వారే నియమించుకోవాలన్నారు. 

 ట్రాఫిక్ మార్షల్‎కి మేము ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికీ వారిని ఉపయోగిస్తామని తెలిపారు. ట్రాఫిక్ అసిస్టెంట్‎లుగా విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్ జెండర్లు బాగా పని చేస్తున్నారని.. మంచి ఫలితాలు వస్తున్నాయని కొనియాడారు. ఇక, వచ్చే వర్ష కాలం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని,  హైడ్రా, జీహెచ్ఎంసీతో కలిసి ముందుకు వెల్లుతున్నామన్నారు. నగరంలో ప్రయివేటు ట్రావెల్స్ బస్సులు న్యూసెన్స్ చాలా ఎక్కువ ఉందని దానిపై కూడా వారి యాజమాన్యాలతో మీటింగ్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies