Type Here to Get Search Results !

Sports Ad

ఇందిరమ్మ ఇండ్లు రానివారు భయపడద్దు అందరికీ ఇండ్లు ఇస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి Those who do not come to Indiramma's houses should not be afraid, we will provide houses to everyone: Minister Vivek Venkataswamy

ఇందిరమ్మ ఇండ్లు రానివారు భయపడద్దు అందరికీ ఇండ్లు ఇస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : సిద్ధిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి ఇందిరమ్మ ఇళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పేదల కోసం ఏ వాగ్దానాలు చేసిందో వాటిని నెరవేరుస్తుందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తారా లేదా అన్న అపోహ ఉండేదని... ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి పేదల కోసం పథకాలు అమలు చేయాలని సంకల్పించారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు రానివారు భయపడద్దని అందరికీ ఇండ్లు ఇస్తామని అన్నారు మంత్రి వివేక్.

 కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని తరువాత ప్రజలు డబుల్ బెడ్రూం ఇండ్లు వస్తాయని ఎదురుచూసినా రాలేదని అన్నారు. ఇచ్చే ఐదు లక్షలు మాకే ఇస్తే మేమే కట్టుకుంటాం అని చాలామంది అడిగారని, అందుకే ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు లబ్ది దారులకే డబ్బులు ఇస్తుందని అన్నారు. సిద్దిపేట జిల్లా కు ఎక్కువ ఇండ్లు మంజూరు చేయిస్తానని అన్నారు మంత్రి వివేక్.

 ఇండ్లు మంజూరైన వాళ్ళు ఇండ్లు త్వరగా పూర్తి చేసుకోవాలని వీటి కోసం రుణాలు కూడా ఇప్పించాలని కలెక్టర్ కు చెప్పానని అన్నారు. దీని కోసం ముఖ్యమంత్రితో మాట్లాడుతానని అన్నారు మంత్రి వివేక్. రాహుల్ గాంధి, రేవంత్ రెడ్డి ఎప్పుడు పేదల పక్షాన ఆలోచిస్తుంటారని అన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇచ్చిందని, ఇప్పుడు 200 యూనిట్ల లోపు ఇండ్లకు ఉచిత కరెంట్ ఇచ్చిందని అన్నారు. గ్యాస్ 500 కే ఇస్తామని చెప్పినట్టు ఇస్తున్నామని మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నామని అన్నారు. 23 వేల కోట్ల రుణమాఫీ చేశామని ఇది కేవలం కాంగ్రెస్ తోనే సాద్యమని అన్నారు. 

 రైతు భరోసా కూడా రైతుల అకౌంట్లో పడుతుందిని మంచి వైద్యం కోసం పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ తెచ్చామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పది లక్షల ఉచిత వైద్యం చేస్తున్నామని అన్నారు.సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు నిధులు ఇస్తూ భరోసా ఇస్తున్నామని అన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies