కేంద్ర ప్రభుత్వ ‘ఫిట్ ఇండియా అవార్డు’ కు ఎంపికైన సెలబ్రిటీ కపుల్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : 11వ ప్రపంచ యోగా దినోత్సవం (జూన్ 21న) సందర్భంగా ఓ బాలీవుడ్ జంట ‘ఫిట్ ఇండియా అవార్డు’ అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటించిన "ఫిట్ ఇండియా కపుల్ అవార్డు" హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ దంపతులకు లభించింది.
ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ " ఫిట్ నెస్ అనేది మాకు జీవనవిధానం. ప్రజలను యోగా వైపు ఆకర్షితులను చేయడంలో భాగమైనందుకు మాకు గర్వంగా ఉంది. ఈ ప్రయాణంలో భాగం కావడం ప్రపంచ యోగా దినోత్సవం రోజే "ఫిట్ ఇండియా కపుల్ అవార్డు దక్కించుకోవడం మాకెంతో గర్వంగా ఉందని' రకుల్ వెల్లడించింది. మీకు ఎలాంటి ఫ్యాన్సీ జిమ్‌లు అవసరం లేదు. అది ఇంట్లోనే ప్రారంభించవచ్చని రకుల్ తెలిపింది.
ఈ యోగా కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతను ఇస్తూ, రకుల్ మరియు జాకీ భగ్నాని వేదికపై సూర్య నమస్కారాలను ప్రదర్శించారు. ఇవి జీవన విధానంలో ఫిట్‌నెస్ సందేశాన్ని ఇచ్చేలా ఉన్నాయి. ఆరోగ్యం మరియు సమతుల్య జీవనం కోసం ఈ జంట వేసిన యోగాసానాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. వారి కృషికి గుర్తింపుగా, 'ఫిట్ ఇండియా కపుల్' అనే బిరుదును కేంద్రప్రభుత్వం ప్రదానం చేసింది.
జూన్ 20న రకుల్ తన X (గతంలో ట్విట్టర్)లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫిట్ ఇండియా కల్ట్ యోగాథాన్‌లో అందరూ భాగం కావాలని కోరింది.
"యోగా మనకు ఉనికిని గుర్తు చేస్తుంది. ఇది మనలో మరియు మన చుట్టూ సమతుల్యత, అవగాహన మరియు కరుణను కనుగొనడం గురించి తెలిపే ఒక సాధనం. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియం నుండి జరిగే ఫిట్ ఇండియా కల్ట్ యోగాథాన్‌లో చేరండి.
మనం అందరం కలిసి, ఆరోగ్యాన్ని జీవన విధానంగా చేసుకుందాం" అని వీడియోలో చెప్పుకొచ్చింది. ఇకపోతే, ప్రస్తుతం రకుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ "దే దే ప్యార్ దే 2"లో ఆయేషా ఖురానా పాత్రను తిరిగి పోషించనుంది. ఈ మూవీ 2019లో వచ్చిన హిట్ "దే దే ప్యార్ దే"కి సీక్వెల్.