Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల ఏ సబ్జెక్ట్ ఎప్పుడంటే Telangana TET Exam Schedule Released, Which Subject, When

తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల ఏ సబ్జెక్ట్ ఎప్పుడంటే

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ టెట్ 2025 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసింది ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జూన్ 18 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ పరీక్షలు రెండు షిఫ్ట్ లలో జరగనున్నాయి. పేపర్ - 1, పేపర్ - 2 గా జరిగే ఈ పరీక్షల కోసం జిల్లాల వారీగా ఎగ్జామ్ డేట్స్, సబ్జెక్టులు కేటాయించింది ప్రభుత్వం. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 :30 గంటల వరకు రెండో షిఫ్ట్ నిర్వహించనున్నారు.

 5 వ తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులకు పేపర్ 1, ఆరో తరగతి, ఆపై బోధించాలని అనుకునే అభ్యర్థులకు పేపర్ 2 కింద ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో ఉండగా, కొన్ని సబ్జెక్టులకు హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, సంస్కృతం మాధ్యమాల్లో కూడా ఉండనున్నాయి. పేపర్ 2విభాగంలోని మ్యాథ్స్, సైన్స్ ఎగ్జామ్ తో ప్రారంభమయ్యే ఈ పరీక్షలు వరుసగా 16 సెషన్లలో జరగనున్నాయి. జూన్ 30న మైనారిటీ భాషల్లో జరిగే మాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, తో పరీక్షలు ముగియనున్నాయి.

 జిల్లాల వారీగా కేంద్రాలు, సంబంధిత సబ్జెక్టులు, పరీక్షా తేదీల వివరాలు షెడ్యూల్ లో వెల్లడించింది ప్రభుత్వం.నిజామాబాద్, జగిత్యాల, పటాన్చెరు, సంగారెడ్డి  నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, సిరిసిల్ల, మంచిర్యాల, ములుగు, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు షెడ్యూల్లో తెలిపింది ప్రభుత్వం.

త్వరలోనే హాల్ టికెట్స్ విడుదల చేస్తామని అఫీషియల్ వెబ్ సైటులో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది ప్రభుత్వం. అభ్యర్థులు  షెడ్యూల్ కి అనుగుణంగా తేదీలు గమనించి ఎగ్జామ్స్ కి సిద్ధమవ్వాలని తెలిపింది ప్రభుత్వం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies