ఎక్మయి గ్రామంలో పలు సమస్యలు
* అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని వినతి పత్రం అందజేస్తున్న యువకులు
* వాగ్దానాల మీదే పరిమితం చేతలే ఉండవు.ఇది మెయిన్ హెడ్డింగ్
* వినతులు విన్నవించుకుంటున్నాం కానీ ప్రయోజనం శూన్యం
బషీరాబాద్ భారత్ న్యూస్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మయి గ్రామంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్ వస్తాయి అన్నారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చినవారికి ముగ్గు వేయడం జరిగింది. గ్రామ ప్రజలు వారి యొక్క సమస్యలు చెప్పడంతో త్వరలో పరిష్కరిస్తామన్నారు.
అంబేద్కర్ యువ జన సంఘం నుండి గత 10 సంవత్సరాల నుండి అంబేద్కర్ కమ్యూనిటీ నిర్మించాలని చాలా సార్లు ఎమ్మెల్యే లకు వినతి పత్రాలు చూస్తున్నారు చదువుతున్నారు కానీ ఏమి ప్రయోజనం లేదు. హామీ ఇస్తున్నారు తప్ప కార్య సాధనలో లేదు అని గ్రామ ప్రజలు యువకులు అంటున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.