నేటి (ఆగస్టు 04) నుంచి సీపీగెట్ ఎగ్జామ్స్అటెండ్ కానున్న 63 వేల మంది
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఈడీ తదితర పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం సోమవారం నుంచి సీపీగెట్ ఎంట్రెన్స్ టెస్టులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 4న ఎంఏ ఎకనామిక్స్ ఎగ్జామ్ తో ప్రారంభమై 11 న ఎంఏ సోషియాలజీతో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ముగియనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 63,089 మంది అటెండ్ కానుండగా, వారికోసం అధికారులు 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొత్తం 44 పీజీ కోర్సుల్లో ఎంట్రెన్స్ కు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 1గంట నుంచి 2.30గంటల వరకు, సాయంత్రం 4.30గంటల నుంచి 6గంటల వరకు మూడు సెషన్లలో ఎగ్జామ్స్ జరగనున్నాయి. సోమవారం మార్నింగ్ సెషన్లో ఎంఏ ఎకనామిక్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ సబ్జెక్టులతో పరీక్షలు ప్రారంభం కానున్నాయి.