Type Here to Get Search Results !

Sports Ad

స్థిరంగా గోల్డ్ రేట్లు హైదరాబాదులో ఇవాళ తులం ఎంతంటే Gold rates remain stable in Hyderabad. What is the current price of gold in Hyderabad

స్థిరంగా గోల్డ్ రేట్లు హైదరాబాదులో ఇవాళ తులం ఎంతంటే

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆర్థిక పరిస్థితుల మార్పుల కారణంగా గోల్డ్, సిల్వర్ లాంటి మెటల్స్ ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో లక్షకు పైకి చేరిన తులం బంగారం ధరలు స్థిరంగా స్వల్ప పెరుగుదలతో ముందుకు సాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు షాపింగ్ చేయాలా వద్దా అనే గందరగోళంలో రాఖీకి ముందు ఉన్నారు. 

 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.50 స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 295, ముంబైలో రూ.9వేల 295, దిల్లీలో రూ.9వేల 310, కలకత్తాలో రూ.9వేల 295, బెంగళూరులో రూ.9వేల 295, కేరళలో రూ.9వేల 295, వడోదరలో రూ.9వేల 300, అహ్మదాబాదులో రూ.9వేల 300, జైపూరులో రూ.9వేల 310, మంగళూరులో రూ.9వేల 295, నాశిక్ లో రూ.9వేల 298, మైసూరులో రూ.9వేల 295, అయోధ్యలో రూ.9వేల 310, బళ్లారిలో రూ.9వేల 295, గురుగ్రాములో రూ.9వేల 310, నోయిడాలో రూ.9వేల 310 వద్ద విక్రయించబడుతున్నాయి.

 ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.50 పెరిగింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే గ్రాముకు చెన్నైలో రూ.10వేల 140, ముంబైలో రూ.10వేల 140, దిల్లీలో రూ.10వేల 155, కలకత్తాలో రూ.10వేల 140, బెంగళూరులో రూ.10వేల 140, కేరళలో రూ.10వేల 140, వడోదరలో రూ.10వేల 145, అహ్మదాబాదులో రూ.10వేల 145, జైపూరులో రూ.10వేల 155, మంగళూరులో రూ.10వేల 140, నాశిక్ లో రూ.10వేల 143, మైసూరులో రూ.10వేల 140, అయోధ్యలో రూ.10వేల 155, బళ్లారిలో రూ.10వేల 140, గురుగ్రాములో రూ.10వేల 155, నోయిడాలో రూ.10వేల 155గా ఉన్నాయి. 

 ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.92వేల 950 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 14వందలుగా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 23వేల వద్ద ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies