కలలో కూడా కొనలేని రేట్లకు గోల్డ్ & సిల్వర్ మంగళవారం హైదరాబాద్ రేట్లివే
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ సుంకాలను పెంచుతానని చేసిన ప్రకటనలు పెద్ద ప్రకంపనలకు దారితీశాయి. దీంతో ప్రపంచ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ పెట్టుబడిదారులు తమ సంపదను రక్షించుకునేందుకు గోల్డ్, సిల్వర్ వైపు మళ్లుతున్నారు. దీంతో రిటైల్ వ్యాపారం తక్కువగానే ఉన్నప్పటికీ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో శుభకార్యాలకు షాపింగ్ చేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు గందరగోళంలో ఉన్నారు. కొన్నాళ్లు ఆగి షాపింగ్ చేద్దామనే ఉద్ధేశంలో కనిపిస్తున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.7వేల 500 భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ రేట్లను పరిశీలిస్తే గ్రాముకు చెన్నైలో రూ.9వేల 370, ముంబైలో రూ.9వేల 370, దిల్లీలో రూ.9వేల 385, కలకత్తాలో రూ.9వేల 370, బెంగళూరులో రూ.9వేల 370, కేరళలో రూ.9వేల 370, పూణేలో రూ.9వేల 370, వడోదరలో రూ.9వేల 375, జైపూరులో రూ.9వేల 385, లక్నోలో రూ.9వేల 385, మంగళూరులో రూ.9వేల 370, నాశిక్ లో రూ.9వేల 373, అయోధ్యలో రూ.9వేల 385, బళ్లారిలో రూ.9వేల 370, గురుగ్రాములో రూ.9వేల 385, నోయిడాలో రూ.9వేల 385 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.8వేల 200 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ రేట్లను గమనిస్తే గ్రాముకు చెన్నైలో రూ.10వేల 222, ముంబైలో రూ.10వేల 222, దిల్లీలో రూ.10వేల 237, కలకత్తాలో రూ.10వేల 222, బెంగళూరులో రూ.10వేల 222, కేరళలో రూ.10వేల 222, పూణేలో రూ.10వేల 222, వడోదరలో రూ.10వేల 227, జైపూరులో రూ.10వేల 237, లక్నోలో రూ.10వేల 237, మంగళూరులో రూ.10వేల 222, నాశిక్ లో రూ.10వేల 225, అయోధ్యలో రూ.10వేల 237, బళ్లారిలో రూ.10వేల 222, గురుగ్రాములో రూ.10వేల 237, నోయిడాలో రూ.10వేల 237గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.93వేల 700 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 2వేల 220గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు రూ.2వేలు పెరిగి రూ.లక్ష 25వేల వద్ద ఉంది.