తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాఖీ పండుగ రక్షాబంధనము అన్నదమ్ములు అక్కా చెల్లెళ్లు జరుపుకునే పండుగ. రాఖీ పండుగ ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 9న జరుపుకొనే రాఖీ పండుగ తోబుట్టువులకు ప్రతీకగా నిలుస్తుంది. అయితే అన్నా, తమ్ముళ్లకు రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముళ్లు వేయాలి ఐదు లేదాఏడు ముళ్లు ఎందుకు వేయకూడదు ఏ సమయంలో రాఖీ కట్టాలి దీని వెనకున్న కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రక్షాబంధనం రాఖీ పండుగ అంటే కేవలం రాఖీ కట్టడమే కాదు. సోదరికి సోదరుడు రక్షగా ఉంటాడని చెప్పడం అలాగే సోదరుడి అభివృద్దిని సోదరి కోరుకుంటుందని చెప్పే పండుగ రాఖీ. రాఖీని కట్టేటప్పుడు మూడు ముళ్లు వేయాలి. ఈ మూడు ముళ్లు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తులకు ప్రతీకగా నమ్ముతారు.
మొదటి ముడి సోదరుడి దీర్ఘాయుష్షు, భద్రత, ఆనందం మరియు శ్రేయస్సును సూచిస్తుంది. రెండవ ముడి సోదరుడు మరియు సోదరి మధ్య విడదీయరాని ప్రేమ, నమ్మకం మరియు గౌరవాన్ని సూచిస్తుంది. మూడవ ముడి సోదరుడు తన జీవితంలో ఎల్లప్పుడూ గౌరవం , సత్య మార్గాన్ని అనుసరించాలని తాను ఏ పరిస్థితిలో ఉన్న తన సోదరిని రక్షించాలని తన విధులను గుర్తు చేస్తుంది.
రాఖీ ఎప్పుడు కట్టాలి...
శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 08, 2025న మధ్యాహ్నం 02:12 గంటలకు ప్రారంభమై ఆగస్టు 09, 2025న మధ్యాహ్నం 01:24 గంటలకు ముగుస్తుంది. రాఖీ కట్టడానికి శుభ సమయం ఆగస్టు 9న ఉదయం 06:18 నుండి మధ్యాహ్నం 01:24 వరకు ఉంటేంది. సూర్యోదయానికి ముందే భద్ర సమయం ముగిసిపోతుందని పండితులు చెబతున్నారు.
రాఖీని మూడు ముళ్లతో కట్టే ఆచారం విశ్వాసం, ఐక్యత, శాశ్వత తోబుట్టువుల సంబంధానికి అందమైన ప్రతిరూపంగా భావిస్తారు. ఇది కేవలం ఒక దారం మాత్రమే కాదు. కాలాన్ని, దూరాన్ని దాటి, సోదర సోదరీమణుల మధ్య సంబంధాన్ని బలపరిచే పవిత్ర బంధం.అందుకే మీ సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టేటప్పుడు మూడు ముడులు వేయమని పండితులు సూచిస్తున్నారు.