Type Here to Get Search Results !

Sports Ad

దీపావళి బంపర్ ఆఫర్‌ కేవలం 1 రూపాయికే నెల మొత్తం 4G ఇంటర్నెట్, కాల్స్ ఫ్రీ Diwali bumper offer: 4G internet, free calls for a month for just Rs. 1


 దీపావళి బంపర్ ఆఫర్‌ కేవలం 1 రూపాయికే నెల మొత్తం 4G ఇంటర్నెట్, కాల్స్ ఫ్రీ

సాంకేతిక వార్తలు భారత్ ప్రతినిధి : దీపావళి సందర్భంగా భారత టెలికాం కంపెనీ BSNL  కస్టమర్ల కోసం ఒక స్పెషల్ ఆఫర్‌ తీసుకొచ్చింది. ఈ అఫర్ కింద ఒక నెల మొత్తం ఉచితంగా 4G డేటా ఇస్తుంది. దీపావళి స్పెషల్  బోనస్‌గా కొత్త కస్టమర్లు కేవలం ఒక రూపాయితో నెల మొత్తం 4G ఇంటర్నెట్ డేటా పొందొచ్చు.

 BSNL ప్రకారం, కస్టమర్లు ఇప్పుడు ఇండియా మొత్తం 4G నెట్‌వర్క్‌ ఫ్రీగా  ఆస్వాదించొచ్చు. ఇందుకు ఎటువంటి సర్వీస్  ఛార్జీలు లేవు, కాబట్టి కస్టమర్లు ఎలాంటి ఎక్స్ట్రా  చార్జెస్ లేకుండా  30 రోజుల పాటు అంటే ఒక నెల మొత్తం 4G ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు.

అఫర్ వివరాలు:
* ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్
* రోజుకు 2GB హై-స్పీడ్ డేటా
* రోజుకు 100 SMSలు
* ఉచిత సిమ్ కార్డ్
ఆగస్టు ఆఫర్ సక్సెస్ : ఈ ఏడాది  ప్రారంభంలో కూడా ఇలాంటి అఫర్ చాలా సక్సెస్ అయ్యింది.  దింతో BSNL ఈ కొత్త ప్రమోషనల్ ఆఫర్ పై కూడా నమ్మకంగా ఉంది. BSNL గత నెల ఎయిర్‌టెల్‌ను అధిగమించి కస్టమర్ల పరంగా రెండవ అతిపెద్ద మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌గా అవతరించింది. 1 లక్ష 38 వేళా కంటే ఎక్కువ మంది కొత్త కస్టమర్లు BSNLకి మారారు. 

బిఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్ ప్రకటన...
ఫ్రీ ఆఫర్ ముగిసిన తర్వాత కూడా కంపెనీ సర్వీస్ క్వాలిటీ, నెట్‌వర్క్ కవరేజ్, బ్రాండ్ పై నమ్మకంతో  కస్టమర్లు BSNLతోనే ఉంటారని BSNL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎ. రాబర్ట్, జె. రవి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆఫర్‌ ఎలా పొందాలి: కొత్త కస్టమర్లు మీ దగ్గరలోని BSNL స్టోర్‌ వెళ్లడం లేదా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ  ఆఫర్‌  పొందవచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు ఉంటుంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies