Type Here to Get Search Results !

Sports Ad

ఆపిల్ దీపావళి ధమాకా సేల్ : ఐఫోన్ 16, మ్యాక్‌బుక్‌, ఎయిర్ పాడ్స్ సహా వీటిపై భారీ డిస్కౌంట్స్ Apple Diwali Dhamaka Sale: Huge discounts on iPhone 16, MacBook, AirPods and more


భారత్ ప్రతినిధి : ఇండియాలో అందరూ ఎంతగానో ఎదురుచూసే దీపావళి సేల్ వచ్చేసింది. ఈ పండుగ సందర్భంగా ఐఫోన్ 16 సిరీస్, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్‌లు, ఎయిర్‌పాడ్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆపిల్ భారీ డిస్కౌంట్స్ ఇస్తోంది. అయితే ఈ పండుగ ఆఫర్లు ఆన్‌లైన్‌లో, ఆపిల్ స్టోర్లలో లభిస్తాయి.  ఈ సేల్‌లో ముఖ్యంగా ఇన్స్టంట్  క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ EMI,  ట్రేడ్-ఇన్ డీల్స్ (ఎక్స్చేంజ్) కూడా ఉన్నాయి.  

 ఈ సేల్ సమయంలో కస్టమర్‌లు  పరికరాలపై ఉచితంగా పేరు చెక్కించుకునే సదుపాయం, కొత్త వస్తువులను సెటప్ చేయడంలో సహాయం, వారంటీని పెంచుకునే అవకాశం వంటి ప్రత్యేక ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఆపిల్ కొన్ని రోజులకు మాత్రమే ఈ  డీల్స్‌  ఇస్తోంది. అంటే, కస్టమర్లు  డిస్కౌంట్ ధరలకు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ వస్తువులను కొనుక్కోవచ్చు. ఈ ఆఫర్లు ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న ఆథరైజ్డ్ స్టోర్లలో లభిస్తాయి.

ఐఫోన్ 16 సిరీస్: ఈ దీపావళి సేల్ సందర్భంగా బ్యాంక్ కార్డ్స్ ఉపయోగించి కొనే ఐఫోన్ 16 మోడళ్లపై ఆపిల్ రూ. 5వేల వరకు ఇన్స్టంట్  క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. అంతేకాకుండా కస్టమర్‌లు 12 నెలల వరకు నో కాస్ట్ EMI సదుపాయం పొందవచ్చు. ఈ ఆఫర్లు ఆపిల్ స్టోర్లలో ఇంకా  రిటైల్ స్టోర్లలో ఉన్నాయి.

మ్యాక్‌బుక్స్: ఈ దీపావళి సేల్ సందర్భంగా ఆపిల్ కంపెనీ మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో సహా కొన్ని  మ్యాక్‌బుక్ మోడళ్లపై రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తోంది.  

* M4 చిప్‌తో 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ధర రూ.1,69,900 నుండి రూ.1,59,900కు తగ్గింది.
M4 ప్రో చిప్‌తో 16-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ధర రూ.2,49,900 నుండి రూ.2,39,900కు తగ్గింది.

పండగ డీల్స్: దీపావళి సేల్‌లో భాగంగా ఆపిల్ ఎయిర్‌పాడ్‌లు, ఇతర ఆక్సెసరీస్‌  పై కూడా డిస్కౌంట్లను ఇస్తోంది. ఎంచుకున్న ఉత్పత్తులపై కస్టమర్‌లు ఇన్స్టంట్  క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ EMI అప్షన్ పొందవచ్చు. ఆపిల్ ఇష్టపడేవారికి ఆపిల్ ఆడియో డివైజెస్, ఆక్సెసరీస్ కొనడానికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.

ఈ ఆఫర్లను ఎలా పొందాలంటే :
ముందు మీ దగ్గరలోని ఆపిల్ స్టోర్ లేదా ఆథరైజ్డ్ రిటైల్ స్టోర్లకు వెళ్లండి.
ఇంస్టేన్ట్ క్యాష్‌బ్యాక్ కోసం చెప్పిన బ్యాంక్ కార్డ్స్  వాడండి.
కావాలనుకుంటే నో కాస్ట్ EMI అప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కోసం మీ పాత వస్తువులను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. 
* ఈ ఆపిల్ దీపావళి ఆఫర్లు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies