తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : అక్టోబర్ నెల ప్రారంభం నాటి నుంచి బంగారం రేట్లు విపరీతమైన ర్యాలీతో దూసుకుపోతున్నాయి. దీనికి తోడు మరోపక్క వెండి కూడా రోజురోజుకూ వేలల్లో పెరుగుతూ దీపావళి, ధనత్రయోదశకి ముందు విపరీతంగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి రేటు రూ.2లక్షలు కేజీ క్రాస్ చేసి మానవ చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలకు చేరుకుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులతో పాటు సరఫరా, డిమాండ్ వంటి అంశాలు రేట్లను పెంచుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే అక్టోబర్ 13తో పోల్చితే 10 గ్రాములకు అక్టోబర్ 14న రూ.3280 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.328 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు భగ్గుమంటున్నాయి.
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 14న):
హైదరాదాబాదులో రూ.12వేల 868
కరీంనగర్ లో రూ.12వేల 868
ఖమ్మంలో రూ.12వేల 868
నిజామాబాద్ లో రూ.12వేల 868
విజయవాడలో రూ.12వేల 868
కడపలో రూ.12వేల 868
విశాఖలో రూ.12వేల 868
నెల్లూరు రూ.12వేల 868
తిరుపతిలో రూ.12వేల 868
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు అక్టోబర్ 13తో పోల్చితే ఇవాళ అంటే అక్టోబర్ 14న 10 గ్రాములకు రూ.3000 పెరుగుదలను చూసింది. దీంతో మంగళవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 14న):
హైదరాదాబాదులో రూ.11వేల 795
కరీంనగర్ లో రూ.11వేల 795
ఖమ్మంలో రూ.11వేల 795
నిజామాబాద్ లో రూ.11వేల 795
విజయవాడలో రూ.11వేల 795
కడపలో రూ.11వేల 795
విశాఖలో రూ.11వేల 795
నెల్లూరు రూ.11వేల 795
తిరుపతిలో రూ.11వేల 795
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారం ప్రారంభం నుంచి తగ్గేదేలే అన్నట్లుగా కొనసాగిస్తోంది. దీంతో అక్టోబర్ 14 కేజీకి వెండి అక్టోబర్ 13తో పోల్చితే రూ.4వేలు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.2లక్షు 06వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.206 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.