Type Here to Get Search Results !

Sports Ad

4 రోజులు వరసగా జంక్ ఫుడ్ తింటే చాలు మీ బ్రెయిన్ డ్యామేజ్ ఖాయం అంట Eating junk food for 4 days in a row can cause brain damage, study says


Health News భారత్ ప్రతినిధి : వీకెండ్లో ఫాస్ట్ ఫుడ్, స్నాక్స్ తినడం వల్ల మీ మెదడుకు ఎం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా...? అసలు ఎంతో ఇష్టంగా తినే వీటి వల్ల కలిగే ప్రమాదం గురించి తెలుసా జంక్ ఫుడ్ మీ శరీరాన్ని మాత్రమే కాదు,  మీ మెదడు జ్ఞాపకశక్తిని  కూడా హరించేస్తుంది. న్యూరాన్‌లో వచ్చిన  ఒక కొత్త అధ్యయనం ప్రకారం, కొన్ని రోజులు జంక్ ఫుడ్ తినడం వల్ల ఇంకా బర్గర్లు, ఫ్రైస్, పిజ్జా, చిప్స్ వంటివి కూడా మీ మెదడు జ్ఞాపకశక్తి  అయిన హిప్పోకాంపస్‌కు ఆటంకం కలిగిస్తాయి, అలాగే మీ జ్ఞాపకశక్తిని కూడా దెబ్బతీస్తుందని పరిశోధకులు కనిపెట్టారు. 

 అధిక కొవ్వు పదార్థాలు మెదడులోని న్యూరాన్‌ల పనితీరును దెబ్బతీస్తాయని పరిశోధకులు గుర్తించారు. దింతో మెదడు మసకబారాడం(brain fog), జ్ఞాపకశక్తి తగ్గడం, నిదానంగా ఆలోచించడం వంటి సమస్యలు మొదలవుతాయి. హిప్పోకాంపస్ అనేది మెదడులో జ్ఞాపకశక్తికి ముఖ్యమైనది. ఇది మీరు మీ వస్తువులను ఎక్కడ పెట్టారో వంటి విషయాలను గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. ఇంకా మీరు ఏం తింటారు, ఎంత నిద్రపోతారు, ఎంత ఒత్తిడికి గురవుతారు అనే విషయాలు దీనితో ఉంటుంది. అంటే, మీరు మీ ప్లేట్‌లో పెట్టుకునే  ఆహారం మీ మెదడు సమాచారాన్ని ఎంత బాగా గుర్తుంచుకుంటుందో, ప్రాసెస్ చేస్తుందో దాని పై ప్రభావం చూపిస్తుంది.

 పరిశోధకులు ఎలుకలకు నాలుగు రోజులు బర్గర్లు, ఫ్రైస్, పిజ్జా వంటి అధిక కొవ్వు, జంక్ ఫుడ్ లాంటి ఆహారాన్ని ఇచ్చారు. అలాగే హిప్పోకాంపస్‌లో CCK ఇంటర్న్‌యూరాన్స్ అని పిలువబడే మెదడు కణాలపై దృష్టి పెట్టారు. ఇవి మెదడులోని జ్ఞాపకశక్తి సంకేతాలు (సిగ్నల్స్) స్పష్టంగా, సమతుల్యంగా ఉండేలా చూస్తాయి.

 కానీ ఈ కణాలు ఓవర్‌యాక్టివ్ మారినప్పుడు జ్ఞాపకశక్తిలో గందరగోళం ఏర్పడి జ్ఞాపకశక్తి లోపం వస్తుంది. అధిక కొవ్వు ఆహారం తీసుకున్న నాలుగు రోజుల తర్వాత ఈ CCK ఇంటర్న్‌యూరాన్‌లు ఓవర్‌డ్రైవ్‌లోకి వెళ్తాయి. దింతో ఇది మొత్తం జ్ఞాపకశక్తిని  దెబ్బతీసింది. చివరికి ఎలుకలు సాధారణంగా చేయగలిగే పనుల్లో ఇబ్బంది పడ్డాయి. అంటే వాటి జ్ఞాపకశక్తి సమస్యలు బయటపడ్డాయి. ఈ అధ్యయనంలో ఎలుకలను ఉపయోగించిన, మనుషులపై చేసిన అధ్యయనాలు కూడా ఇలాంటి ఫలితాలనే చూపిస్తున్నాయి. 

 ఎక్కువగా ప్రాసెస్ చేసిన లేదా అధిక కొవ్వు ఉన్న ఆహారం తినే వ్యక్తులు కొద్ది రోజుల తర్వాత కూడా మెదడు చాల డల్ గా ఇంకా మతిమరుపు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. జంక్ ఫుడ్ కేవలం బరువు పెరగడానికి, గుండె జబ్బులకు మాత్రమే కాకుండా కొన్ని రోజుల్లోనే మీ జ్ఞాపకశక్తిని, మానసిక స్పష్టతను దెబ్బతీస్తుందని ఈ అధ్యయనం నిరూపిస్తుంది.

జ్ఞాపకశక్తిని కాపాడుకోవడానికి చిట్కాలు: మీరు జ్ఞాపకశక్తి పడిపోవడం/ తగ్గడం  లేదా మెదడు డల్ అవడం గురించి ఆందోళన చెందితే  నిపుణులు ఈ విషయాలు పాటించాలని సూచిస్తున్నారు.

* మెదడుకు ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మంచి ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తినాలి.

* హైడ్రేటెడ్‌గా ఉండండి: మీ శరీరానికి కావాల్సినంత నీరు తాగండి. డీహైడ్రేషన్ వల్ల శరీరంలో వాటర్ శాతం తగ్గడం కూడా మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.

* బాగా నిద్రపోండి: మీరు నిద్రపోతున్నప్పుడే హిప్పోకాంపస్ జ్ఞాపకాలను బలపరుస్తుంది.

* వ్యాయామం చేయండి: వ్యాయామం మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.

* జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం మానేసేయండి: చిన్న చిన్న జంక్ ఫుడ్ కూడా మీ జ్ఞాపకశక్తిలో మార్పులను తీసుకురావొచ్చు. అందుకే ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం ఆపేయండి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies