Type Here to Get Search Results !

Sports Ad

ఉదయం, మధ్యాహ్నం ఎండ సాయంత్రం రాత్రి వానలు మరో వారంపాటు తెలంగాణలో ఇదే పరిస్ధితి Sunny in the morning and afternoon, rain in the evening and night, the situation in Telangana will remain the same for another week.

 

మరో వారంపాటు తెలంగాణలో ఇదే పరిస్ధితి

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే ఒక్కోచోట భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి రానున్న వారంలో రోజుల్లో కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే వారం రోజులపాటు  రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు ఉండే ఛాన్స్​ఉందని ఐఎండీ చెబుతోంది. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో అధిక ఎండలు, సాయంత్రి, రాత్రి వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. 

 రానున్న వారం రోజులు ఉదయం మధ్యాహ్నం వేళల్లో సాధారణ ఉష్ణోగ్రతలకంటే రెండు నుంచి మూడు డిగ్రీల అధికంగా నమోదు అయ్యే ఛాన్స్​ ఉంది. ఎండ తీవ్రత పెరగడంతో తేమ శాతం పెరిగి వర్షాలకు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  

 ఇక ఈ వారం రోజులు వర్షాలతోపాటు పెద్ద ఎత్తున ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. అక్కడక్కడ వడగండ్ల వాన పడుతుందని అంచనా వేసింది ఐఎండీ. సోమవారం(అక్టోబర్6) రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. క్యూమిలోనింబస్​మేఘాల కారణంగా వర్షాలు కురిస్తాయని తెలిపింది. 

 మంగళవారం రాష్ట్రంలోని  అన్ని జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండి అంచనా వేసింది. వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన  వర్షం పడుతుందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 

 ఇక బుధవారం కూడా పలు జిల్లాల్లో వర్షం పడుతుందని ఐఎండీ హెచ్చరించింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని ఎ ల్లో అలెర్ట్​జారీ చేసింది. 

 అక్టోబర్​ 9న కూడా  రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ  గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్,మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్​ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

 అక్టోబర్​10న ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి,హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని అక్కడక్కడ వానలు పడతాయని తెలిపింది ఐఎండీ.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies