Type Here to Get Search Results !

Sports Ad

పోరాటం ఆపినప్పుడే నిజమైన ఓటమి: పోస్ట్‎తో రిటైర్మెంట్ వార్తలకు క్లారిటీ ఇచ్చిన కోహ్లీ

ఒక్క పోస్ట్‎తో రిటైర్మెంట్ వార్తలకు క్లారిటీ ఇచ్చిన కోహ్లీ

భారత్ ప్రతినిధి : టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం సిద్ధమయ్యాడు. 2025, అక్టోబర్ 19న పెర్త్ స్టేడియం వేదికగా జరగనున్న తొలి వన్డే కోసం జట్టుతో కలిసి కోహ్లీ ఇప్పటికే ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. అయితే ఆస్ట్రేలియా టూర్ వేళ కోహ్లీ రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

 ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన కోహ్లీ వన్డేలకు కూడా వీడ్కోలు పలుకుతాడని ఆస్ట్రేలియా వన్డే సిరీసే కోహ్లీకి చివరిదని ప్రచారం జరుగుతోంది. కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడటం డౌటేనని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కోహ్లీ అభిమానులు గందరగోళానికి గురైతున్నారు.

 ఇక తమ అభిమాన ఆటగాడిని గ్రౌండ్‎లో చూడలేమా అని బాధపడుతున్నారు. ఈ క్రమంలో తన రిటైర్మెంట్ గురించి పుకార్లు షికార్లు చేస్తోన్న వేళ విరాట్ క్లోహీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ‘‘పోరాటం ఆపాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో అప్పుడే మనం ఓడిపోయినట్లు’’ అని ఆసక్తికర ట్వీట్ చేశాడు కోహ్లీ. ఈ ట్వీట్ చూసిన కోహ్లీ అభిమానులు సంబరపడుతున్నారు. 

 కోహ్లీ వన్డేలకు ఇప్పుడే రిటైర్మెంట్ ఇవ్వరని 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగుతాడని ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జట్టులో నెలకొన్న తీవ్ర పోటీ, యువకుల ఎంట్రీతో కోహ్లీ, రోహిత్‎కు 2027 వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు కష్టమేనని క్రీడా వర్గా్లో ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో గివప్ ఇచ్చే ప్రసక్తే లేదన్న కోహ్లీ పరోక్షంగా కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies