Type Here to Get Search Results !

Sports Ad

భూత శుద్ధి పద్దతిలో పెళ్లి చేసుకున్న సమంత లింగ భైరవి అంత శక్తి గల అమ్మవారా Samantha Linga Bhairavi, who was married through the method of ghost cleansing, is a powerful goddess.

Movies News సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రం దగ్గర లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన 'భూత శుద్ధి వివాహం' పద్ధతిలో సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి జరిగింది. ప్రముఖ నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో ఉన్న లింగ భైరవి దేవి సన్నిధిలో, పవిత్రమైన 'భూత శుద్ధి వివాహం' ద్వారా ఒక్కటయ్యారని ఈశా ఫౌండేషన్ తెలిపింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకను అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు.

 ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియే ఈ 'భూత శుద్ధి వివాహం'. లింగ భైరవి ఆలయాల్లో లేదా ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ క్రతువు, వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుంది. వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. సమంత, రాజ్ జంటకు ఈశా ఫౌండేషన్ హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపింది. దేవి అపారమైన అనుగ్రహంతో వీరి జీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించింది.

లింగ భైరవి గురించి...
సద్గురు చేతుల మీదుగా ఈశా యోగ కేంద్రంలో 'ప్రాణ ప్రతిష్ఠ' చేయబడిన లింగ భైరవి దేవి, స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర, కారుణ్య స్వరూపం. జీవితాన్ని సుసంపన్నం చేసే ఎన్నో విశిష్టమైన ఆచారాలకు ఈ ఆలయం నెలవు. విశ్వంలోని సృజనాత్మక శక్తికి ప్రతీకగా నిలిచే ఈ ఎనిమిది అడుగుల శక్తి స్వరూపం- భక్తుల మనశ్శరీరాలను, శక్తులను స్థిరపరుస్తూ, జననం నుంచి మరణం (ముక్తి) వరకు జీవితంలోని ప్రతి దశలోనూ వారికి అండగా నిలుస్తుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies