Type Here to Get Search Results !

Sports Ad

డిసెంబరులో తగ్గిన కమర్షియల్ సిలిండర్ల రేట్లు సామాన్యులకు దక్కని ఊరట The reduction in commercial cylinder rates in December is no relief for the common man.

తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతినెల మాదిరిగానే డిసెంబర్ 1న కూడా LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో కీలక మార్పులను ప్రకటించాయి. దీంతో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ల రేటు అత్యల్పంగా రూ.10 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి ప్రభుత్వ చమురు కంపెనీలు. ఇదే క్రమంలో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ల రేటు విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

 గడచిన కొన్ని నెలలుగా ఆయిల్ కంపెనీల తీరు చూస్తే నవంబరులో కమర్షియల్ సిలిండర్ రేటు స్వల్పంగా రూ.5 తగ్గించగా సెప్టెంబరులో రూ.51 చొప్పున తగ్గింపును ప్రకటించాయి. అయితే అక్టోబరు నెలలో మాత్రం సిలిండర్ రేట్లను స్వల్పంగా రూ.16 మేర పెంచాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో తాజా రేట్లను గమనిస్తే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ఢిల్లీలో రూ.1580.50, ముంబైలో రూ.1531.50, కలకత్తాలో రూ.1684, చెన్నైలో రూ.1739.50గా ఉన్నాయి. ఇక హైదరాబాదులో సిలిండర్ రేటు రూ.1801.50గా ఉంది.

 ఇక డొమెస్టిక్ సిలిండర్ల రేటు మాత్రం దాదాపు అనేక నెలలుగా ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగిస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలో ప్రధాన మెట్రో సిటీల్లో గృహ వినియోగ సిలిండర్ల రేటు ఢిల్లీలో రూ.853, ముంబైలో రూ.852.50, లక్నోలో రూ.890.50, హైదరాబాదులో రూ.905గా కొనసాగుతున్నాయి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies