క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్ WPL షెడ్యూల్ రిలీజ్
క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్ గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు డబ్ల్యూపీఎల్-2026 పూర్తి షెడ్యూల్‌ను శనివారం (నవంబర్ 29) బీసీసీఐ ప్రకటించింది. 2026, జనవరి 9వ తేదీన డబ్ల్యూపీఎల్ టోర్నీకి తెర లేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ ఓపెనింగ్ మ్యాచ్‌కు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం అతిథ్యం ఇవ్వనుంది.
2025, ఫిబ్రవరి 5వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 28 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ ముంబై, వడోదరలోని రెండు వేదికలలో జరగనుంది. తొలి 11 మ్యాచులు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనుండగా ఫిబ్రవరి 3న జరిగే ఎలిమినేటర్, ఫైనల్‌తో సహా టోర్నమెంట్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు వడోదరలోని కోటంబి స్టేడియం అతిథ్యం ఇవ్వనుంది. పురుషుల అండర్-19 ప్రపంచ కప్, పురుషుల T20 ప్రపంచ కప్ వంటి అంతర్జాతీయ టోర్నీలకు క్లాష్ కాకుండా పకడ్బందీగా డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ రూపొందించారు.
ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ మూడవ టైటిల్‌పై కన్నేయగా మూడు సీజన్లలో రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆర్సీబీ రెండోసారి డబ్ల్యూపీఎల్ విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ రౌండ్‌కు చేరుకోని గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ ఈసారి టైటిల్ గెలవాలనే కసితో బరిలోకి దిగుతున్నాయి.
డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచులు:
జనవరి 9 MI vs RCB
జనవరి 10 UPW వర్సెస్ GG
జనవరి 10 MI vs DC
జనవరి 11 DC వర్సెస్ GG
జనవరి 12 RCB vs UPW
జనవరి 13 MI vs GG
జనవరి 14 UPW vs DC
జనవరి 15 MI vs UP
జనవరి 16 RCB vs GG
జనవరి 17 UPW vs MI
జనవరి 17 DC vs RCB
వడోదరలోని కోటంబి స్టేడియంలో జరగనున్న మ్యాచులు:
జనవరి 19 జిజి vs ఆర్‌సిబి
జనవరి 20 DC vs MI
జనవరి 22 GG వర్సెస్ UP
జనవరి 24 RCB vs DC
జనవరి 26 RCB vs MI
జనవరి 27 GG వర్సెస్ DC
జనవరి 29 UPW vs RCB
జనవరి 30 GG vs MI
ఫిబ్రవరి 1 DC vs UP
ఫిబ్రవరి 3 ఎలిమినేటర్
ఫిబ్రవరి 5 ఫైనల్





