Type Here to Get Search Results !

Sports Ad

వింటర్ సీజన్ లో సూపర్ ఫుడ్ బెల్లం తింటే ఇన్ని ప్రయోజనాలా These are the benefits of eating the superfood jaggery in the winter season

ఆరోగ్య వార్తలు భారత్ ప్రతినిధి : చలికాలంలో  రోజువారీ జీవితంలో వచ్చే మార్పులు అనేకం ఆరోగ్యం, ఆహారం,జీవనశైలిపై ప్రభావం చూపుతాయి. ఈ  కాలంలో చలిని తట్టుకోవడానికి వెచ్చని దుస్తులు ధరించడం, రోగనిరోధక శక్తిని పెంచే పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం వంటి చేస్తుంటాం అయితే శీతాకాలంలో  మన ఇండ్లలో మనవాళ్లు తరుచుగా బెల్లం వాడకం చూస్తుంటాం. ఇది మనకు  ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. 

 మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు బెల్లంలో ఉంటాయి. ఐరన్​, కాల్షియం, జింక్​, కాపర్​ , మెగ్నీషియం, పాస్ఫరస్​ వంటి ఖనిజ లవణాలు ఇందులో ఉంటాయి. వీటితోపాటు బీకాంప్లెక్స్,సి,డి, ఇ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు, లవణాలు ఉండటంలో ప్రతి రోజు బెల్లం తినాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

వింటర్​ లో బెల్లంఎందుకు తినాలి: బెల్లం ఛాతి, గొంతునొప్పిని తగ్గించేందుకు  సాయపడుతుంది. చలిరోజుల్లో శ్లేష్మం సడలించడం ద్వారా చికాకును తగ్గిస్తుంది. శ్వాసను సులభతరం చేసే వెచ్చని గుణాన్ని కలిగిస్తుంది. అల్లం లేదా నల్ల నువ్వులతో కలిపితే మరింత ప్రయోజనాలు పొందవచ్చు. 

చక్కెర స్థాయిలు తగ్గకుండా శక్తి పెరుగుదలకు: శుద్ధి చేసిన చక్కెరలా కాకుండా బెల్లంలో శక్తి విడుదల నెమ్మదిగా ఉంటుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడమేకాకుండా అలసటను నివారించడంతోసాయపడుతుంది. అంతేకాదు జీర్ణక్రియకు సాయపడే ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా వింటర్​ టైంలో బెల్లాన్ని భోజనంచేసిన తర్వాత తింటే తింటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

చర్మ సంరక్షణకు: చర్మ సంరక్షణకు బెల్లం బెస్ట్​ వన్​ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, రక్త శుద్ది కణాలు చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి. చర్మ కణాలకు పోషణ నిస్తాయి. దీంతో చర్మాన్ని పొడిబారకుండా మృదువుగా చేస్తుంది. ముసలితనం ఛాయలను  కూడా తగ్గిస్తుంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies