భారత్ ప్రతినిధి : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 49.
విభాగాల వారీగా ఖాళీలు: అన్ రిజర్వ్డ్ 15, ఈడబ్ల్యూఎస్ 5, బీసీ–ఏ-3, బీసీ–-బీ-4, బీసీ–-సీ 0, బీసీ–-డీ 4, బీసీ-–ఈ 2, ఎస్సీ-–I 0, ఎస్సీ-–-II 5, ఎస్సీ---–III 3, ఎస్టీ 5, స్పోర్ట్స్ 1 పీహెచ్ 2).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌లకు ఐదేళ్లు, పీహెచ్ అభ్యర్థులకు 10 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మన్, ఎన్సీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 8.
అప్లికేషన్ ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు రూ.500.
ఎగ్జామినేషన్ ఫీజు: అభ్యర్థులు అందరూ రూ.120 చెల్లించాలి.
లాస్ట్ డేట్: జులై 15.
రాత పరీక్ష: 2026, అక్టోబర్ (తాత్కాలికం).
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.tgpsc.gov.in ను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్....
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ / ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించే పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–--Iలో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు 150 మార్కులకు, పేపర్-–-IIలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (డిగ్రీ స్థాయి) నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులకు ఇస్తారు. పేపర్-–-I ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. పేపర్–--II కేవలం ఇంగ్లిష్ లో మాత్రమే ఉంటుంది.





