Type Here to Get Search Results !

Sports Ad

సూర్యకుమార్ తర్వాత భారత టీ20 కెప్టెన్ ఎవరు రేపే బీసీసీఐ కీలక మీటింగ్ BCCI to hold crucial meeting tomorrow to decide who will be India's T20 captain after Suryakumar

క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : టీమిండియా ఫ్యాన్స్‌ ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తుంది. మొన్ననే ఇండియాకి టీ20 వరల్డ్ కప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ (SKY) కెప్టెన్సీకి ఎండ్ కార్డ్ పడబోతుందా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు టీమ్‌ను సెలెక్ట్ చేసే ముందే కెప్టెన్సీ మార్పుపై బీసీసీఐ అపెక్స్ కమిటీ ఒక రేంజ్‌లో డిస్కషన్స్ చేయబోతుంది. 

రిస్క్‌లో సూర్య కెప్టెన్సీ:
రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న సూర్యకుమార్ యాదవ్.. లీడర్‌గా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆయన కెప్టెన్సీలో భారత్ ఆడిన ప్రతి సిరీస్‌నూ క్లీన్ స్వీప్ చేసింది. 2025 ఆసియా కప్, రీసెంట్‌గా జరిగిన 2026 టీ20 వరల్డ్ కప్‌లను కూడా టీమిండియా సొంతం చేసుకుంది. సూర్య కెప్టెన్సీలో ఇండియా 52 మ్యాచ్‌లు ఆడితే అందులో ఏకంగా 42 మ్యాచ్‌లు గెలిచింది. అంటే విన్ పర్సంటేజ్ అక్షరాలా 84 శాతంగా ఉంది. కానీ కెప్టెన్సీ పరంగా సూర్య 'కింగ్' అనిపించుకున్నా బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. కెప్టెన్ అయినప్పటి నుంచి 45 మ్యాచ్‌ల్లో కేవలం 25.88 యావరేజ్‌తో 932 రన్స్ మాత్రమే చేశాడు. అందులో కేవలం 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

రేసులో ఆ ముగ్గురు క్రేజీ కుర్రాళ్లు:
ఈ నెల జూన్ 26 నుంచి జూలై 11 వరకు జరగబోయే ఐర్లాండ్ (2 మ్యాచ్‌లు), ఇంగ్లాండ్ (5 మ్యాచ్‌లు) టూర్‌ల కోసం బీసీసీఐ కొత్త కెప్టెన్‌ను అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రెజెంట్ కెప్టెన్సీ రేసులో ముగ్గురు యంగ్ ప్లేయర్స్ గట్టిగా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్సీ మెటీరియల్, ఆల్రెడీ ఐపీఎల్ లో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక తిలక్ వర్మ (Tilak Varma) ఫ్యూచర్ స్టార్ యంగ్ అండ్ డైనమిక్ మరోవైపు ఇషాన్ కిషన్ (Ishan Kishan) అగ్రెసివ్ మైండ్‌సెట్ ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ దీంతో ఈ ముగ్గురిలో ఎవరికి కెప్టెన్ బాధ్యతలు దక్కుతాయో రేపటి వరకు వేచి చూడాలి. 

ఒలింపిక్స్-2028 గోల్డ్ మెడల్ ప్లాన్!: 
వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌ లో ఇండియాకి గోల్డ్ మెడల్ తేవడమే నా నెక్స్ట్ టార్గెట్ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కానీ, సీన్ కట్ చేస్తే సూర్య ఫామ్ చూసి బీసీసీఐ ఇప్పుడే ఫ్యూచర్ కోసం ఒక యంగ్ కెప్టెన్‌ను రెడీ చేయాలని ఫిక్స్ అయింది.  

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies