Type Here to Get Search Results !

Sports Ad

భారీగా తగ్గిన బంగారం, వెండి కొనేందుకు మంచి ఛాన్స్ తులం ధర ఎంతంటే What is the price of Libra? A good chance to buy heavily discounted gold and silver

తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : అమెరికా-ఇరాన్ మధ్య దాడులు ముదురుతుండటం, వస్తువుల ధరలు పెరుగుతాయనే భయం, ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతాయన్న ఆందోళనల వల్ల ప్రపంచ మార్కెట్లు తీవ్రంగా  దెబ్బతిన్నాయి. దింతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు   భారీగా పడిపోయాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడం, ముడి చమురు ధరలు అధికంగా ఉండటంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరిగాయి.  

బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయంటే.... 
ఇరాన్ - ఇజ్రాయిల్  యుద్ధం మొదలైన కొత్తలో అందరూ పోటీ పడి బంగారం కొనడంతో ధరలు ఆకాశానికి అంటాయి. ఇప్పుడు అంత రేటు పెట్టి ఎవరూ కొనలేక పోతుండటంతో ధరలు మెల్లగా దిగివస్తున్నాయి. ధరలు బాగా పెరిగినప్పుడు కొన్నవారు, ఇప్పుడు ఆ లాభాన్ని నగదుగా మార్చుకోవడానికి ఉన్న  బంగారాన్ని అమ్మేస్తున్నారు. దీనివల్ల మార్కెట్లో బంగారం నిల్వలు పెరిగి ధరలు తగ్గుతున్నాయి. బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉండటంతో, ప్రజలు బంగారం మీద కంటే డిపాజిట్లు లేదా బాండ్ల మీద పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక  పెట్రోల్, డీజిల్ ధరలు  పెరగడం వల్ల అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయనే భయం మొదలైంది. ఇది కూడా వడ్డీ రేట్లు పెరగడానికి దారితీస్తోంది.

 ఈరోజు (మార్చ్ 23) 1 గ్రాము 24 క్యారెట్ల  బంగారం ధర రూ.595 తగ్గి రూ.14,002, 22క్యారెట్ల  ధర రూ. 545 తగ్గి రూ. 12,835, 18 క్యారెట్ల  ధర రూ.446 తగ్గి  రూ.10,502. 

 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.5,950 తగ్గి రూ.1,40,020, 22 క్యారెట్ల బంగారం ధర  రూ.5,450 తగ్గి రూ.1,28,350, 18 క్యారెట్ల బంగారం ధర రూ.4,460 తగ్గి  రూ.1,05,020     

 హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.14,002, 22 క్యారెట్ల బంగారం ధర రూ.12,835,     18 క్యారెట్ల బంగారం ధర రూ.10,502

 విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు,  నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప,  అనంతపురంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర    రూ.14,002, 22 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.12,835, 18 క్యారెట్ల బంగారం ధర రూ.10,502

తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి  ధర రూ.15 తగ్గి రూ.230, కేజీకి రూ.2,30,000 వద్ద రూ.15,000 తగ్గింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies