తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : ఆధార్ కార్డును మరింత సులువుగా ఉపయోగించుకునేలా క్రెడిట్ కార్డు సైజులో పీవీసీ కార్డు తీసుకొచ్చిన UIDAI.. ఈ కార్డు నామినల్ ఛార్జీలను పెంచింది. గతంలో 50 రూపాయలు ఉండే ఛార్జీని 75 రూపాయలకు పెంచింది. యూనిక్ ఐడెంటిఫికేషన్అథారిటీ ఆఫ్ ఇండియా (ఉడాయ్) ఈ వెసులుబాటును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పాలివినిల్ క్లోరైడ్ కార్డు (పీవీసీ కార్డు)ను పర్సులోనే పెట్టుకొని ఎక్కడికి అంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు.
ఇందులో ఎన్నో సెక్యూరిటీ ఫీచర్ల ఉండటంతోపాటు సాధారణ కార్డుతో పోలిస్తే ఎక్కువ కాలం మన్నుతుంది. వేగంగా వెరిఫై చేసుకోవచ్చు. ఆన్లైన్లో 75 రూపాయలు చెల్లించి ఆర్డర్ చేస్తే దాదాపు వారంలోపే పోస్ట్‌మ్యాన్ తెచ్చిస్తాడు. ఈ పీవీసీ కార్డ్ ఆర్డర్ చేసుకోలంటే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలని ఒక క్యూఆర్ కోడ్ను కూడా ‘ఆధార్’ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఈ కార్డు వల్ల ప్రయోజనాలు:
* ట్యాంపర్ ప్రూఫ్ క్యూఆర్ కోడ్
* మైక్రో టెక్ట్స్
* ఘోస్ట్ ఇమేజ్
* నాణ్యమైన ప్రింటింగ్, లామినేషన్ వల్ల ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎక్కువకాలం మన్నుతుంది.
* దీనిపై హోలోగ్రామ్, గులోచ్ ప్యాటర్న్, ఘోస్ట్ ఇమేజ్, మైక్రోటెక్ట్స్ ఉండటం వల్ల డూప్లికేట్ తయారు చేయడం కష్టం.
* ఇది పూర్తిగా వెదర్ ప్రూఫ్. అంటే నీరుపడ్డా, దుమ్ము అంటినా ఏమీ కాదు. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. పాడవుతుందనే బాధ అక్కర్లేదు.
* క్యూ ఆర్ కోడ్ కూడా ఉంటుంది. వెంటనే ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ సాధ్యమవుతుంది.





