Type Here to Get Search Results !

Sports Ad

మార్చి మొదటి వారంలోనే దంచికొడుతోన్న ఎండలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దబిడిదిబిడే The scorching heat of the first week of March is even more intense this year than last year.

తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : వేసవి కాలం ప్రారంభమైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ముదురుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ తీవ్రత, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 34 నుంచి 40 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 

 శని, ఆది వారాల్లో పలు జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా. శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేయనున్నారు. హైదరాబాద్‎లోనూ గత రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు  2 డిగ్రీలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. 

 సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న వెల్లడించారు. ఎండల తీవ్రత పెరుగుతోన్న దృష్ట్యా అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా 11 నుంచి 3 గంటల మధ్య జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘ కాలిక వ్యాధి గ్రాస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies