Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణలో మరో రెండురోజులు మస్తు ఎండలు 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Two more days of scorching heat in Telangana, orange alert for 16 districts

తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలకంటే 4 నుంచి5 డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. ఉదయం  9 గంటలనుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం అయితే వేడి, వడగాల్పులతో ప్రజలు సతమతమతువున్నారు. ఈ క్రమంలో రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాష్ట్రంలోని 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

 అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజాంబాద్, జగిత్యాల ,కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ,సంగారెడ్డి ,మెదక్, మహబూబ్నగర్, వరంగల్, జనగాం, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ.  ఈ  ప్రాంతాల్లో 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

 మరోవైపు వికారాబాద్, హైదరాబాద్ ,రంగారెడ్డి ,నల్గొండ , భద్రాద్రి కొత్తగూడెం, జనగాం యాదాద్రి భువనగిరి ములుగు మహబూబాబాద్, జిల్లాలకు ఎలొ  అలెర్ట్  ఆయా ప్రాంతాలలో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్య అవకాశం తెలిపింది. 

 ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాలలో ధోని కారణంగా గాలి దిశ మార్చుకోవడంతో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది.  ఈరోజు నుంచి మరో ఐదు రోజులపాటు కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం  పాటు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో గాలి ఉండనున్నది తెలిపింది వాతావరణ శాఖ. 

 శుక్రవారం (ఏప్రిల్ 24) అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజాంబాద్ ,రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ,మెదక్ ,సంగారెడ్డి ,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.  

 ఏప్రిల్ 28 న ఆరు జిల్లాలు మినహా అన్ని జిల్లాలలో వర్షం పడే అవకాశం ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి ,వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలలో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies