Type Here to Get Search Results !

Sports Ad

బంగారం రేట్లలో తగ్గుదల ఎన్నాళ్లు కొనసాగుతుంది? తగ్గిన హైదరాబాద్ ధరలు ఇవే How long will the decline in gold prices continue? These are the prices that have fallen in Hyderabad

తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : బంగారం, వెండి ధరలు ఈవారం ఎక్కువ రోజుల పాటు తగ్గుతూనే ఉన్నాయి. ప్రధానంగా శాంతి చర్చల ఫలితాల కోసం దేశీయ స్టాక్ మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది పరిస్థితులను చూస్తుంటే. దీంతో బులియన్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. డబ్బులు చేతిలో ఉన్నా చాలా మంది విలువైన లోహాలపై బెట్టింగ్ వేసేందుకు ఆసక్తి చూపటం లేదు. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రమ తమ నగరాల్లో తాజా రేట్లను తెలుసుకోవటం మంచిది. 

 ఏప్రిల్24న బంగారం రేట్లు తగ్గాయి. ఏప్రిల్ 23 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.60 తగ్గుదలను నమోదు చేసింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 295గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 020గా కొనసాగుతోంది. 

 శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్24, 2026న దేశవ్యాప్తంగా పెద్ద మార్పు లేకుండా కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 65వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము రూ.265గా అమ్మకాలు జరుగుతున్నాయి. మెుత్తానికి ఇరాన్ యుద్ధానికి ఒక ముగింపు వచ్చేంత వరకూ బులియన్ మార్కెట్లు స్థిరపడటం కష్టమే అంటున్నారు వ్యాపారులు. అప్పుడే వాటి దిశ ఎలా ఉంటుందో చెప్పగలం అంటున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies