Type Here to Get Search Results !

Sports Ad

ఈ వారం థియేటర్లలో దుమ్మురేపే సినిమాలు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ This week's blockbuster movies in theaters, full entertainment guaranteed

సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : ఈ వారం (ఏప్రిల్ 30 & మే1న) థియేటర్లలో అదిరిపోయే సినిమాలు వస్తున్నాయి. గడిచిన రెండు వారలు సౌండ్ లేక చతికిలపడ్డ థియేటర్లు, ఈ వారంతో దుమ్మురేగనున్నాయి. మోస్ట్ అవైటెడ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ప్రేక్షకులకు ఫుల్ వినోదాన్ని అందించనున్నాయి. అందులో యాక్షన్, కామెడీ, దేశభక్తి, బయోపిక్ వంటి అన్నీ రకాల జోనర్లలో సినిమాలు దర్శనం ఇవ్వనున్నాయి. మరి ఆ సినిమాలేంటో వాటి స్టోరీ బ్యాక్ డ్రాప్ ఏంటో తెలుసుకుందాం.

తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’: 
తరుణ్ భాస్కర్ లీడ్‌‌ రోల్‌‌లో కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. జేడీ చక్రవర్తి, హీరో శ్రీ విష్ణు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శుక్రవారం మే 1న థియేటర్లోకి రానుంది.  అమెరికా వీసా సమస్యలు మరియు డోనాల్డ్ ట్రంప్‌పై పగ అనే ఆసక్తికరమైన కథాంశంతో మూవీ తెరకెక్కింది. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

సత్య ‘జెట్లీ’:
టాలీవుడ్ సెన్షేషన్ కమెడియన్ సత్య హీరోగా రాబోతున్నారు. మత్తు వదలరా డైరెక్టర్ రితేష్‌‌‌‌ రానా తెరకెక్కించిన ‘జెట్లీ’ మూవీతో ఈ వారం సందడి చేయనున్నాడు. యాక్షన్‌‌‌‌, కామెడీ, ట్విస్టులతో సినిమా థ్రిల్లర్ జానర్లో రూపొందింది.  ఇప్పటికే టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. రితేష్ తనదైన స్టైల్‌‌‌‌లో ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ సమస్పిస్తున్న ఈ మూవీ మే 1న థియేటర్లలోకి రానుంది. 

ధనుష్ ‘కర’:
ధనుష్ హీరోగా విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కర' (Kara). ధనుష్ కరసామిగా, మమితా బైజు సెల్లిగా నటిస్తున్నారు. గురువారం ఏప్రిల్ 30, 2026న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. వరుస బ్యాంక్ దోపిడీల నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ డ్రామాలో మలయాళ స్టార్ నటుడు సూరజ్ వెంజారమూడు కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

మోహన్‌లాల్ ‘పేట్రియాట్’:
మహేష్ నారాయణన్ దర్శకత్వంలో మమ్ముట్టి, మోహన్‌లాల్, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'పేట్రియాట్' (2026). జాతీయ భద్రత, నిఘా కుట్రల నేపథ్యంలో సాగే ఈ పాన్-ఇండియా సినిమా మే 1న విడుదల కానుంది. నయనతార, కుంచకో బోబన్ కీలక పాత్రలు పోషించారు. 

సాయి పల్లవి ‘ఏక్ దిన్’:
సాయి పల్లవి నటించిన బాలీవుడ్ డెబ్యూ మూవీ 'ఏక్ దిన్' (Ek Din) మే 1, 2026న థియేటర్లలో విడుదలకి సిద్ధమైంది. తెలుగులో ‘ఒకరోజు’ అనే టైటిల్‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు.

ఇందులో జునైద్ లో లోపల సిగ్గుపడే రోహన్ అనే యువకుడిగా, సాయి పల్లవి ఉల్లాసంగా ఉండే అమ్మాయిగా మీరా పాత్రలో నటిస్తుంది. మీరాను ఇష్టపడే రోహన్ ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం భయపడుతుంటాడు. జీవితంలో ఒక్క రోజైనా ఆమెతో కలిసి ప్రయాణం చేయాలని కలలు కంటాడు. మరి రోహన్ ప్రేమలో ఎలాంటి పరిణామాలు చోటు చోసుకున్నాయనేది మెయిన్ స్టోరీ.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies