ఈరప్ప కుటుంబానికి 2 లక్షల చెక్కు అందజేసిన ఎస్బిఐ బ్యాంకు అధికారులు
బషీరాబాద్ : బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన అనంతమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది.అనంతమ్మ తన పేరు మీద ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన ఇన్సూరెన్సు చేసుకోవడం జరిగింది. నామిని తన భర్త ఈరప్ప పేరు ఇవ్వడంతో ఇన్సూరెన్సు క్లైమ్ చేశారు.స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మేనేజర్ మరియు అధికారులు శ్రీశైలం,నాగేందర్,బాలు,నర్సిములు,శాస్త్రి,రంగయ్య,గోరె అధికారులు ఈరప్ప గారికి 2 లక్షల ఇన్సూరెన్స్ క్లైమ్ పత్రాన్ని అందజేశారు. అనంతరం ఈరప్ప మాట్లాడుతూ నా భార్య చనిపోయిన బాధ లోటు ఎవరు తీర్చలేరు కానీ ఈ యొక్క ఇన్సూరెన్స్ తన కుటుంబానికి ఆసరా అవుతుంది అని సంతోషం వ్యక్తం చేశారు.