లారీ ఆటో ఢీ కొని ఇద్దరికి గాయాలు- అకస్మాత్తుగా లారీని ఢీకొన్న ఆటో
- ఆటోలో ఉన్న ఇద్దరికి గాయాలు
- తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు
బషీరాబాద్ : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్గి గ్రామం నుండి ఆటోలో కర్ణాటక రాష్ట్రంలోని జట్టురు గ్రామానికి చెందిన వారు బషీరాబాద్ రోడ్డు పై ప్రయాణిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా జీవన్గి గ్రామ శివారులోని నాపరాతి గనులలో నుండి లారీ రోడ్డు పై వస్తున్న క్రమంలో అకస్మాత్తుగా లారీని ఆటో ఢీకొని అక్కడికక్కడే ఆటో కింద పడిపోవడంతో ఆటోలో ఉన్న ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు ఎస్సై విద్య చరణ్ రెడ్డి కి సమాచారం అందించగా పోలీసులు బాధితులను తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్యం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విద్యా చరణ్ రెడ్డి తెలిపారు. లారీ (AP28X8918)ని మరియు ఆటో (AP29V6759)ను పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
- సైబర్ క్రైమ్ నేరాలు నివారణయే ప్రభుత్వ లక్ష్యమని ఎస్సై విద్యా చరణ్ రెడ్డి
- విద్యార్థులను వేధిస్తే 100 మరియు 1098 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు
- పాల్కొన్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సర్పంచులు
బషీరాబాద్ : సైబర్ క్రైమ్ నేరాలు నివారణయే పోలీసు శాఖ మరియు ప్రభుత్వ లక్ష్యమని ఎస్సై విద్యా చరణ్ రెడ్డి తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం పరిధిలోని నవల్గా , మైల్వార్ , దామర్ చెడ్, ఎక్ మై తదితర గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో సైబర్ కాంగ్రెస్ , సైబర్ క్రైమ్ నివారణ, బాల్య వివాహాల నివారణ, బాలకార్మికుల నిర్మూలన, 100 డయల్ మరియు చైల్డ్ లైన్ 1098 ఫై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బషీరాబాద్ ఎస్ఐ విద్యా చరన్ రెడ్డి హాజరయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యా చరణ్ రెడ్డి కి ఘనంగా శాలువాలతో, పూలమాలలతో సన్మానించారు. ఈసందర్భంగా ఎస్ఐ విద్యా చరణ్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ క్రైమ్ నేరాల నివారణయే పోలీస్ శాఖ మరియు ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు . అదే విధంగా విద్యార్థులు ఇంటర్నెట్ వినియోగం చదువు మరియు మంచి కార్యక్రమాలకు మాత్రమే వీక్షించాలని ఆన్లైన్ తరగతులు నిమిత్తం వీక్షించాలని స్పష్టం చేశారు. ఇష్టానుసారంగా అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ పరిచయాలు ఏర్పరుచుకోరాదని పేర్కొన్నారు. ఎవరైనా ఫోన్ చేసి ఓ టి పి, ఏటీఎం కార్డు వివరాలు మరియు వ్యక్తిగత వివరాలు అడిగినచో అలాంటి వాటిని తిరస్కరించాలని మరియు ఇలాంటి సంఘటనలు జరిగితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఓటిపి లు మరియు వ్యక్తిగత విషయాలు ఇతరులకు తేలిసిపోవడంతో డబ్బులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎవరైనా విద్యార్థులను వేధిస్తే 100 మరియు 1098 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందని వెల్లడించారు. ఫైబర్ అంబాసిడర్గా ఎంపికైన విద్యార్థులకు ఎస్ఐ విద్యా చరణ్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో 1098 చైల్డ్ లైన్ ప్రతినిధి హనుమంత్ రెడ్డి మరియు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సర్పంచులు ఉన్నారు.