Type Here to Get Search Results !

Sports Ad

నామినికి చెక్కు అందజేసిన SBI బ్యాంకు మేనేజరు శ్రీశైలం



నామినికి చెక్కు అందజేసిన SBI బ్యాంకు మేనేజరు శ్రీశైలం
  • ప్రధాన మంత్రి జీవన జ్యోతి కింద మృతురాలు కుటుంబానికి 2 లక్షల చెక్కు పంపిణి

బషీరాబాద్ : "ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన" పథకంలో సాధారణ మరణం పొందిన పాలసీదారు కొర్విచెడ్ గని గ్రామానికి చెందిన నీలా బాయి, నామిని సుమీ బాయికి 2 `లక్షల చెక్కును ఎస్బిఐ బ్యాంకు అధికారులు అందజేశారు.ఇటీవల తను అనారోగ్యం కొన్ని రోజులుగా బాధపడుతూ మృతి చెందింది.పాలసీలో నీలా బాయి సభ్యురాలుగా ఉంది.పాలసీ దారు సహజ మరణం చెందడంతో నామిని అయినా తన కూతురు సుమీ బాయికి బషీరాబాద్ SBI బ్యాంకు మేనేజరు శ్రీశైలం 2 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు ఎస్బీఐ మేనేజర్ శ్రీశైలం నర్సిములు,రంగయ్య,శాస్త్రి,నాగేందర్ రెడ్డి,బాలు తదితరులు పాల్గొన్నారు.


వివాహ కార్యక్రమంలో పాల్గొన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

 తాండూరు : తాండూరు పట్టణంలోని జీపీఅర్ గార్డెన్స్ లో బుధవారం రోజు జరిగిన మంబాపూర్ సర్పంచ్ శ్రావణ పెళ్లికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించరు.అనంతరం అదేవిధంగా ఆయా శుభకార్యక్రమాలలో తులసి గార్డెన్స్, వైట్ ప్యాలెస్, వెంకోబా గార్డెన్స్, రాంపూర్ తాండలో జరిగిన పెళ్ళిలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించరు. మరియు తాండూర్ లోని క్యాంపు కార్యాలయం సమీపంలో రాజీవ్ కాలనీ వాసులతో కలిసి ఇటీవల రాజీవ్ కాలనీ సమీపంలో మృతిచెందిన జబ్బార్ కుటుంబ సభ్యులను పరమిషించి, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబంలోని ఒకరికి మాతా శిశు ఆస్పత్రిలో ఉద్యోగంతో పాటు వారి పిల్లలను మైనార్టీ హాస్టల్ లో చేర్పించి చదువుపిస్తామని  అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ రెండో విడతలో వారికి డబుల్ బెడ్ రూమ్ అందిస్తామని అన్నారు.అనంతరం తాండూరు పట్టణంలో జరిగిన పెళ్లిలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించరు. అదేవిధంగా డాక్టర్ భాస్కర్ మరియు సీనియర్ నాయకుడు వెంకట్ రాములు గౌడ్ నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నరు.పట్టణంలో పాలు వివాహ వేడుకల్లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాల్గొని వధూవరులను ఆశీర్వధించారు. అయన వెంట మున్సిపల్ ఛైర్పర్సన్ స్వప్న, కౌన్సిలర్ లు, టీఆరెఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు. అదేవిధంగా తాండూర్ పట్టణంలో పాలు వివాహది శుభాకార్యల్లో వికారాబాద్ జడ్పిటీసీ, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తల్లి ప్రమోదిని రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని నేషనల్ జీపిర్ గార్డెన్స్ ఆర్యవైశ ఓపెన్ హాల్, మేజిస్ట్రిక్, హనుమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ కార్యక్రమంలో ప్రమోదిని రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వధించారు.ఈ యొక్క కార్యక్రమాలలో మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ విఠల్ నాయక్, వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్, రాజు గౌడ్, నర్సింలు, పట్టణ పార్టీ అద్యక్షుడు నయీం అఫూ, పెద్దేముల్ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు మంకాల రఘు, ముక్తార్ నాజ్, మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ దీపానర్సింలు, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి టీఆరెఎస్ నాకాయకులు నర్సిరెడ్డి అడ్వకెట్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


జబ్బార్ కుటుంబ సభ్యులను పరమిషించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

రైతులకు తెగులు నివారణపై పాలు సూచనలు

 బషీరాబాద్ :  మండలం లో పరిశోధన సంస్థ ఏరువాక కేంద్రం తాండూర్ శాస్త్రావేత లు మరియు మండల వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా చేసిన కేంద్రం పరిశీలనలో భాగంగా కశింపూర్, నావల్గా మరియు నాధ్య నాయక్ తండా, బషీరాబాద్ రైతులతో కంది, శనగ, పత్తి, మరియు వేరుచేనగలు పరిశీలించారు. అనంతరం శాస్త్రావేతలు పంటలను పూర్తి స్థాయిలో పంటలను పరిశీలించి కంది, మరియు శనగలు వీడు తెగులు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రా లు పది లీటర్ల నీళ్లలో కలిపి కందల దగ్గర పోయాలి పొలంలో లబ్ది పురుగు నివారణకు విషఎరా వెయ్యాలన్నారు.దానికి గాను కామెడీ కార్డు అనే మందులు వంద గ్రాములకు పది కేజీ ల చౌడు మరియు రెండు కేజీ ల బెల్లం కలిపి ఉండాలు చేసి సాయంత్రం పొలం లో చల్లాలి అలాగే వేరుషణగా మరియు మీరూప లో తామర పురుగుల నివారణకు విప్రోనిల్ అనే మందును పిచికారీ చేసుకోవాలి. అలాగే కందిలో ఆకుగుడు పురుగులు పచ్చ పురుగులు నివారణకు రోజ్ నేషన్ అనే మందు 2 నిమిషాలు ఒక్క లిటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని రైతులకు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కో ఆర్థి నాటర్ అట ప్రవీణ్, అట సుజాత, డాక్టర్ సందీప్, వ్యవసాయ అధికారులు తదితరులు  పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies