అంబేద్కర్ విగ్రహం పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
వికారాబాద్ : పెద్దేముల్ మండల పరిధిలోని గొట్లపలి లో జరిగిన ఘటన అంబేద్కర్ విగ్రహం కు అవమానం జరిగింది పోలీస్ లకు పిర్యాదు చేస్తున్నారు. Dr.BR.అంబేద్కర్ విగ్రహం వెలు, చేవ్వు, విరగొట్టి అవమనపరిచిన నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీస్కొని కటినంగా శిక్షించాలని అంబేత్క్ ర్ సంఘం నాయకులు కెవిపిఎస్ నాయకులు నిరసన తెలుపుతూ పోలీస్ లకు పిర్యాదు చేసినరు వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు లేనిచో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని గొట్లపల్లి హన్మపుర్ యువజన సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొని హెచ్చరిస్తున్నారు.
స్థానిక పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ,కెవిపిఎస్
స్థానిక పెద్దేముల్ మండల్ గొట్లపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వేలు,చేవ్వు విరగ్గొట్టి అవమానపరిచిన నిందితులను వెంటనే అరెస్టు చెయ్యాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ )వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ స్థానిక పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం పై దాడి చేసి అవమానపరిచిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది లేనిచో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు , కెవిపిఎస్ ,ఎస్ఎఫ్ఐ, అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొనడం జరిగింది.
ఎస్పీ నారాయణ కు మద్దతుగా వివిధ శాఖల అధికార యంత్రంగం
- జిల్లా ఎస్పీ నారాయణ పై లేనిపోని ఆరోపణలు ఎందుకు ఇంత కుట్ర ఎందుకు
- ఎస్పీ నారాయణ కు మద్దతుగా నిలుస్తున్న వివిధ శాఖల అధికార యంత్రంగం
- ప్రజల్లో లభిస్తున్న ఆదరణ, మద్దతు,ఆరోపణలు చేస్తున్న వారి నేర చరిత్రను సేకరిస్తున్న ఇంటెలిజెన్సీ వర్గాలు
ఉపసర్పంచ్ పై ఆగిపోయిన అవిశ్వాసం
బషీరాబాద్ : ఉపసర్పంచ్ పై పెట్టిన అవిశ్వసం ఆగిపోయింది. బషీరాబాద్ మండల పరిధిలోని గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ శాంత్ కుమార్ పై అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని చేసిన పనులపై బిల్లులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని వార్డు సభ్యులు ఉపసర్పంచ్ శాంత్ కుమార్ పై అవిశ్వస తీర్మానం పెట్టారు. ఈ అవిశ్వస తీర్మాణాన్ని నవంబర్ 20 వ తేదీన ఉపసర్పంచ్ తొలగిస్తున్నట్లు ఆమోదం చేస్తామని ఆర్థివో వెల్లడించారు.ఈ విషయం తెలుసుకున్న ఉపసర్పంచ్ శాంత్ కుమార్ కోర్టును ఆశ్రయించి నాపై లేనిపోని ఆరోపణలు ఎచసి 1994 చట్టం ప్రకారం తొలగించాలని అవిశ్వసం పెట్టారు. అది చెల్లక పోవడంతో తిరిగి 2018 చట్టం ప్రకారం మరొకసారి అవుశ్వస తీర్మానం నిర్ణయించి నోటీసు ఇచ్చారు. దీంతో కోర్టును ఆశ్రయించిన శాంత్ కుమార్ నాకు రెండు సార్లు నోటిస్ ఎలా ఇస్తారని నాపై అవిశ్వసం ఎలా చెల్లుతుందని కోర్టును ఆశ్రయించడంతో శాంత్ కుమార్ పై పేట్టిన అవిశ్వసన్ని నిలిపి వేయాలని కోర్టు స్టే ఇవ్వడంతో శాంత్ కుమార్ పై ఉన్న అవిశ్వస తీర్మానం నిలిచి పోయింది. దీంతో ఉపసర్పంచ్ శాంత్ కుమార్ టీఆరెఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాము నాయాక్, వల్య నాయక్, తండా సర్పంచ్ శివ, మోహన్, వెంకటప్ప,తదితరులు కలిసి గ్రామ పంచాయతీ ఆవరణలో మిఠాయిలు తినిపించుకున్నారు. బషీరాబాద్ మండలంలో భారీగా మద్యం విక్రయలు
- తాగుడుకు బానిసలవుతున్న యువత
- ధాబాల్లో మద్యం బాబూల సిట్టింగ్
మండల వ్యాప్తంగా బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. మండలంలో 36 గ్రామ పంచాయతీలు ఉండగా మరో పది అనుబందా గ్రామాలు తండాలు ఉన్నాయి 500 నుంచి 1000 జనాభా ఉన్న గ్రామంలో ఐదరు బెల్ట్ షాపులు కొనసాగుతుండగా,2 నుంచి 4 వేల వరకు జనాభా ఉన్న మేజర్ గ్రామ పంచాయతీలో 8నుంచి 10 బెల్ట్ షాప్ లు నడుస్తున్నాయి. ఒక్కో బీరు బాటిల్ క్వార్టర్ కు 10 నుంచి 20 రూపాయలు అదనంగా వాసులు చేస్తున్నారు.ఈ బెల్ట్ షాప్ నిర్వహకులు బషీరాబాద్ లోని బెల్ట్ షాపుల్లో మద్యం తీసుకెళ్లి గ్రామాల్లో అమ్ముతున్నారు. బషీరాబాద్ -తాండూర్ రోడ్డులో పాలు చోట్ల ధాబాలు వెలిచ్చాయి. అవి పేరుకే ధాబాలు ఖని, అక్కడ మద్యం ప్రియులకు సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి. నావంద్గి రోడ్డులోని ఓ ధాబాలో మద్యం నిల్వ ఉంచి నిరతకంగా అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ధాబా ప్రాంతం కర్ణాటక సరిహద్దు గ్రామాలకు దగ్గరగా ఉండడంతో నిత్యం మద్యం తాగేందుకు వచ్చే వారి తాకిడి ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. ఈ ధాబాకు భోజనానికి వచ్చిన వరు మద్యం కొనుక్కొని తాగుతున్నారు. కాగా కొన్ని రోజుల క్రితం ఎక్సయిజ్ ట్రైని ఎస్ఐ, పోలీసు సిబ్బంది తో వచ్చి ధాబాలో తనిఖీ చేసినప్పుడు మద్యం తాగుతూ కొందరు కనిపించగా హెచ్చరించి. పంపించారు. ఉదయం, సాయంత్రం, రాత్రి తేడా లేకుండా గ్రామాల్లో మద్యం అమ్ముతున్నారు. యువకులు మధ్యానికి బానిసలవుతున్నారు. మద్యం మత్తులో తులుతు కొందరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.స్కూళ్ల మైదానంలో మద్యం ప్రియుల అడ్డా మందు బాబులు పాఠశాలలు, మైదానలు, పంట పొలాలలో తాగుతున్నారు. ఉరిచివారా, పాఠశాలలు, మైదానలను ఎంచుకుంటున్నారు. అర్ధరాత్రి వరకు అక్కడే మద్యం తగిన మైకంలో సిసలు పగల గొట్టి ఇష్టరాజ్యాంగ వ్యవహరించిన సంఘటనలు పాఠశాలల్లో వెలుగుచుషయి. రాత్రయితే గ్రామాల్లో, తాండల్లో పూటుగా మద్యం తాగి తిరుగుతూ ఇతరులకు ఇబ్బంది, కలిగిస్తున్న ఘటనలు ఉన్నాయి.ఎక్సయిజ్ అధికారులు బెల్ట్ షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.బెల్ట్ షాప్లను అరికడతాం బెల్టు షాపుల నిర్వహణ అక్రమం. గ్రామాల్లో ఎవరైనా మద్యం అమ్మితే చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తాం అంటున్న పోలీసుల బృందం.