Type Here to Get Search Results !

Sports Ad

నవాంద్గి శివాలయంలో ప్రత్యేక పూజలు




ఆధ్యాత్మిక చింతతోనే మానసిక ప్రశాంతత 

బషీరాబాద్ : బషీరాబాద్ మండల ప్రజలు దైవ భక్తితో  కార్తీక మాసం రెండవ సోమవారాన్ని  పురస్కరించుకొని పూజలు చేస్తున్నారు. ఎంపీపీ,సర్పంచ్ శివాలయంలో ప్రతేక పూజలు చేశారు.నవాంద్గి శివాలయంలో ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ గారు మరియు సర్పంచ్ పుడుర్ ప్రియాంక గారు అభిషేకం నిర్వహించి మరియు దీపోస్తవం లో పాల్గొన్నారు.ఈ సంద్భంగా ఎంపిపి గారు మరియు సర్పంచ్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవలని అన్నారు.గ్రామస్తులు సుఖశాంతులతో చల్లగా ఉండాలని పూజలు చేశారు. ప్రజలు ఆరోగ్యాంగా మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అంటే ఆధ్యాత్మిక చింతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు.




 ఆర్థిక సహాయం కోసం ఓ మహిళ 

హుజూరాబాద్ : ఇటీవల హుజూరాబాద్ లో ఎన్నికలలో బిజీగా  ఉన్న నాయకులు ఓట్ల కోసం ప్రచారాలు చేశారు. కానీ ఇలాంటి పేద ప్రజలకు ఆదుకోకపోవడం బాధాకరం. హుజూరాబాద్ పట్టణంలో జమ్మికుంట వావిలాల గ్రామానికి  చెందిన రమ అనే మహిళ కి జాండిస్ వలన కడుపులోనే ఎనిమిది నెలల పాప చనిపోవడం జరిగింది. అందువలన నాలుగు రోజుల క్రితం కడుపులో నుండి పాపని తొలగించరు. ప్రస్తుతం ఇప్పుడు తనకి లివర్ ఇన్ఫెక్షన్ మరియు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్లు తెలిపారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేర్చారు అక్కడ సరైన చికిత్స అందకపోవడంతో అనారోగ్యం క్షీణించడం తో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది తన పరిస్థితి బాగాలేదు.ఆమె భర్త వికలాంగుడు, నెల్లి రమ అమ్మనాన్న చిన్నప్పుడే చనిపోయారు. కావున వారికి ఏమి తోచని స్థితిలో ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారికి మన వంతుగా ఒక అన్నలా తమ్ముడిలా ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించి ఆ సోదరికి తోడుగా నిలుద్ధాం. ప్రశాంత్  9963366803 phonepay /google pay మరిన్ని వివరాలకు ఈ నెంబర్ కి సంప్రదించండి.




తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్తులు 

ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిరుగారుస్తున్న వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ ను వెంటనే సస్పెండ్ చేయాలి

 కెవిపిఎస్ జిల్లా నాయకులు ఉప్పలి మల్కయ్య డిమాండ్

యాలాల : వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ గారిని సస్పెండ్ చేయాలనీ ఈరోజు యాలాల మండల తహసీల్దార్ గోవిందమ్మ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా కెవిపిఎస్  జిల్లా నాయకులు ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ దోమ మండలం రకొండ గ్రామంలో డా. బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకున్న అధికార పార్టీ  టిఆర్ఎస్  సర్పంచి అతని అనుచరులను అరెస్టు చేయకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులకు బయపడి వారిని అరెస్ట్ చేయకుండా వదిలి పెట్టే విదంగా ఆదేశాలు ఇవ్వడం, దాంతో పాటు జిల్లాలో అనేక మంది దళిత, గిరిజన లపై అగ్రకుల పెత్తందార్లు,అధికార పార్టీ నాయకులు దాడులు చేసినప్పుడు వారిపై ఎస్సి,ఎస్టి  కేసులు పెట్టి కొన్ని లొసుగులను ఉపయోగించుకుని అట్రాసిటీ చట్టాన్ని నిరుగారుస్తున్న వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.అదేవిదంగా.

 వికారాబాద్ జిల్లాలో అనేక మంది దళిత,గిరిజనులపై దాడులు జరిగిన సందర్భాలలో దాడి చేసిన వారిలో అధిక శాతం అధికార పార్టీకి చెందిన నాయకులు ఉండటం గమనార్హం, ఆ కేసులు కూడా దళిత, గిరిజన, ప్రజా సంఘాలు ఒత్తిడి వల్ల పోలీసులు కేసు నమోదు చేస్తే, ఆ నిందితులను తులను అరెస్ట్ చేయకుండా  అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లకు అండగా ఉంటూ  కింది స్థాయి పోలీస్ అధికారులను బెదిరించి Sc, St అట్రాసిటీ చట్టాన్ని నిరుగారుస్తూ వికారాబాద్ జిల్లాలో ఎస్సీ,ఎస్టీలకు ద్రోహం చేస్తున్న వికారాబాద్ జిల్లా ఎస్పీ ఒక్క నిమిషం కూడ వికారాబాద్ జిల్లా లో ఉండడానికి వీళ్ళేదాని దళిత, గిరిజన, ప్రజా సంఘలు ప్రభుత్వన్ని డిమాండ్ చేశాయి.ఒక వైపు రాష్ట్ర డీజీపీ గారు ప్రెండ్లి పోలీస్ అని డీజీపీ ప్రచారం చేస్తుంటే వికారాబాద్ జిల్లాలో మాత్రం బాధితులు న్యాయం కొరకు జిల్లా ఎస్పీ నారాయణ దగ్గరికి పోతే బాధితులను వారికి తోడుగా వెళ్లిన దళిత, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు ఎస్పీ నారాయణ హేళన చేసి మాట్లాడుతూ మనోభావాలను దెబ్బతినే వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం..అధికార పార్టీ నాయకుల అండతో అహంకార పూరితంగా ఎస్పీ వ్యవరస్తున్నారు.చట్టాన్ని దిక్కరించి  జిల్లాలో నేను ఏమిచేసినా నన్ను అడిగేవారు ఎవరున్నారని అని మన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ   తీరు ఉందన్నారు.

ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి జిల్లా ఎస్పీ పై కఠిన చర్యలు తీసుకోవాలి లేకపోతే జిల్లా వ్యాప్తంగా కెవిపిఎస్ మరియు ఇతర దళిత, గిరిజన,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.







Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies