అలంపూర్ : అలంపూర్ పట్టణం లో మద్దూర్ గ్రామంలో హలం పట్టి పొలం దున్నిన నడిగడ్డ బిడ్డ పొలం దున్నడం అంటే మామూలు విషయం కాదు. ఎండలో ఎండుతూ, బురదలో అడుగులు వేస్తూ కష్టపడడం ఏంటో ఒక్క రైతన్నకే తెలుసు.అలంపూర్ నియోజకవర్గంలోని మద్దూర్ గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం ఎద్దుల అరకతో ఏరువాక సాగారు. రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఏకంగా పొలంలోనే దిగిపోయారు. దుక్కిలో ఉన్న రైతులు,రైతు కూలీలతో మాట్లాడి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హలం పట్టి పొలం దున్నుతూ, మొక్కజొన్న విత్తనాలు విత్తారు. అత్యున్నత ఐపిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి,రాజకీయాల్లోకి వచ్చానని, వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఏనుగు గుర్తుకు ఓటెయ్యాలని కోరారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘ నాయకులు
- 17 న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
- దళిత, గిరిజన ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం
- ఎస్పీ నారాయణను సోస్పెండ్ చేయాలి
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణను వెంటనే సస్పెండ్ చేయాలనీ ఈనెల 17 న కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాడం జరుగుతుందని వికారాబాద్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేశారు. ఈ సందర్బంగా బీఎంపి జిల్లా అధ్యక్షులు గట్ట్యా నాయక్, కేవిపిఎస్ జిల్లా అధ్యక్షులు సోమరావు రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్, మహిపాల్, వ్యవసాయ కార్మిక సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం, వెంకటయ్య, జివిఎస్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ లు మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లాకు వచ్చినప్పటి నుండి ఎస్పీ నారాయణ పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన డీజీపీ స్థాయి అధికారులు కూడా జిల్లా ఎస్పీ పై లాలూచి పడుతున్నట్లు జిల్లా ప్రజలకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర డీజీపీ, మానవ హక్కుల కమిషన్ కలసి ఎస్పీ పై పిర్యాదు చేసిన నేటికీ అతని పై విచారణ ప్రారంభించక పోవడం దూర్మార్గం అన్నారు. దోమ మండలం లోని రకొండ గ్రామంలో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రన్ని అడ్డుకున్న అధికార పార్టీ స్కర్పంచి అతని అనుచరులను అరెస్టు చేయకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే లకు, నాయకులకు, బయపడి వారిని అరెస్ట్ చేయకుండా వదిలి పెట్టే విధంగా ఆదేశాలు, ఆదేశాలు ఇవ్వడంతో,పాటు జిల్లాలో అనేక మంది దళిత గిరిజనాలపై అగ్రకుల పెత్తందర్లు, అధికార పార్టీ నాయకులు దాడులు చేసినప్పుడు వారిపై ఎస్సి ఎస్టీ కేసులు పెట్టి కొన్ని లొసుగులకు ఉపయోగించుకొని అట్రాసిటీ చట్టాన్ని నిరుగారిస్తున్న వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ ను వెంటనే సస్పెండ్ చేయాలనీ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఒక వైపేమో ఫ్రెండ్లీ పోలీస్ అని డీజీపీ ప్రచారం చేస్తుంటే వికారాబాద్ జీల్లా లో మాత్రం బాధితులు న్యాయం కొరకు జిల్లా ఎస్పీ నారాయణ దగ్గరికి బాధితులు పోతే బండబూతులు తిట్టడన్నారు. అధికార పార్టీ నాయకుల అండతో అహంకారం పూరితంగా ఎస్పీ వ్యవహారిస్తున్నారు.కావున ఈ నెల 17 న ధర్నా కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో జోగు లాలయ్య. కేవిపిఎస్ యాదగిరి, కృష్ణ, అంజి, అశోక్, నర్సింలు, వెంకటయ్య, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.