న్యూ బ్రిలియంట్ పాఠశాల లో ఘనంగా బాలల దినోత్సవం
- అమ్మ నాన్నల ప్రేమ ఎంత విలువైనదో గుర్తు చేశారు
- విద్యార్థులు రంగురంగుల దుస్తులతో డ్యాన్స్
- డైరెక్టర్ సుశీల హనుమంతు ముఖ్య అతిథి గా
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిగి లో ని న్యూ బ్రిలియంట్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థులు రంగురంగుల దుస్తులతో ఆకట్టుకునే డ్యాన్స్ మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను చేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు డ్యాన్స్ లు చేస్తూ వివిధ వేశాలను ధరించి వల్ల పాత్రల్ని మరియు సేవలను గుర్తుచేశారు. అమ్మ నాన్నల ప్రేమ ఎంత విలువైనదో గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సుశీల హనుమంతు ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తను మాట్లాడుతూ బాలలు భవిష్యత్తు లో సమాజ నిర్మాతలు అని అన్నారు. బాల్యం తిరిగి రాని జ్ఞాపకం అని అన్నారు. ఆటపాటలతో విద్య ని అందిస్తున్న పాఠశాల పని తీరు అలాగే ఉపాధ్యాయుల ప్రోత్సాహం బాగుందని కొనియాడారు .విద్యార్థుల భవిష్యత్తు అనేదితరగతి లో నిర్ణయించబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుశీల హనుమంతు, ప్రిన్సిపల్ విజయలక్ష్మి ,వైస్ ప్రిన్సిపల్ శివకుమార్ మరియు ఉపాధ్యాయ బృందం ,విద్యార్థిని తల్లి దండ్రులు ,విద్యార్థులు పాల్గొన్నారు.