రైలు కింద పడి రైతు ఆత్మహత్య
బషీరాబాద్ : రైలు కింద పడి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బషీరాబాద్ మండలం చేటు చేసుకుంది.మృతి యొక్క వివరాలు బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామనికి చెందిన మల్లగేరి నాగప్ప తండ్రి తిప్పన్న వయస్సు (45) నవల్గా మరియు కొర్విచెడ్ మధ్యన రైలు కింద పడి మృతి చెందాడు.కొందరు వ్యక్తులు మృతదేహాన్ని చూసి రైల్వే అధికారులకు సమాచారాన్ని అందించారు.బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం చేసారు.అనంతరం కుటుంబసభ్యులకు అందజేశారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
తాండూరు : తాండూరు నియోజకవర్గ పరిధిలో అర్హులందరికీ సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందిస్తామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు తెలియజేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో వెంకటయ్యకు కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేశారు.గురువారం రోజు పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు చికిత్స పొందుతున్నాడు. రూ.1లక్ష.50 వేల విలువైన ఎల్ఓసిని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన వారు తన కార్యాలయంలో సంప్రదిస్తే వారికి సహాయం అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
కొండముచ్చు తరలిస్తున్న కార్మికులు
బషీరాబాద్ : విద్యుదామతానికి గురై మృతి చెందిన కొండముచ్చు బషీరాబాద్ మండలం లో అంతక్రియలు నిర్వహించారు. పోలీస్ క్వార్టర్స్ లో ట్రాన్స్ఫార్మర్ వైరు తగిలి కొండముచ్చు మృతి చెందింది. గ్రామ ప్రజలు పోలీస్ సిబ్బంది ఎస్ఐ విద్యా చరణ్ రెడ్డి దృష్టికి మరియు పంచాయతీ కార్యదర్శి సంజీవకు సమాచారం ఇచ్చారు. గ్రామ సర్పంచ్ పూడూరు ప్రియాంక శ్రవణ్ కొండముచ్చు అంతక్రియలకు రు 2 వేలు మరియు ఇతర కార్మికులు నుండి విరాళాలు సమాకూర్చారు. దీంతో పంచాయతీ కార్మికులు అంతక్రియలకు ఏర్పాటు చేశారు. కొత్త వాస్త్రం దారింపజేసి హిందూ సంప్రదాయాలతో అంతక్రియలు నిర్వహించారు. కాలేబారాన్ని రిక్షాలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఎస్ఐ పోలీస్ సిబ్బంది. పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.