ఏకమైలో ఘనంగా జరుపుకున్న బాలల దినోత్సవం
బషీరాబాద్ : ఏకమైలో ఘనంగా జరుపుకున్న బాలల దినోత్సవం బషీరాబాద్ మండలం ఏకమై గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.బుధవారం రోజున విద్యార్థిని,విద్యార్థులు ఒక్క రోజు ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన విద్యార్థులు వారి యొక్క అనుభవాలను తోటి విద్యార్థులతో పంచుకున్నారు.ఒక్క రోజు ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన విద్యార్థులు స్వయంగా ఉపాధ్యాయుల బాధ్యత ఎలా ఉంటుందో తెలుసుకున్నామన్నారు.ఈ కార్యక్రమంలో టీచర్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బాధ్యతలు వహించారు.వారి వారి వృత్తిల పరంగా చేపట్టిన విద్యార్థులు డిఈఓ గా జయిబా,అర్చన,ఎంఈఓ ఇబ్రహీం,విష్ణు వర్ధన్,హెడ్ మాస్టర్ నవిత,వరుణ్,పండు,షామల.ఈ యొక్క కార్యక్రమాలలో పాఠశాల చైర్మన్ మరియు పాఠశాల ప్రధానోపాద్యాయులు,ఉపాధ్యాయులు జగదీష్,రవి కిరణ్,ప్రసాద్,శోభన్ బాబు,సురేష్,అంబ ప్రసాద్,విశాల్,భాగ్య లక్ష్మి,ఉమా రాణి గ్రామ సర్పంచ్ నారాయణ,ఉప సర్పంచ్ మల్లేష్ విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పలుకొన్నారు.
పాఠశాల ప్రధానోపాద్యాయులు మాధవి,అస్మా,విద్యార్థులు
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.బుధవారం రోజున విద్యార్థిని,విద్యార్థులు ఒక్క రోజు ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన విద్యార్థులు ఎంతో సంతోషంగా బాధ్యతలు వహించారు.ఈ కార్యక్రమంలో టీచర్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మరియు గ్రామ సర్పంచ్ల బాధ్యతలు వహించారు.కలెక్టర్ గా పూజ,డిఈఓ గా ప్రవల్లిక,ఎంఈఓ గా వంశీ,హెడ్ మాస్టర్ గా రోహిత్,సర్పంచ్ గా వేణు,ఉపాధ్యాయులు పవన్ తెలుగు,అల్కా నందిని మ్యాథ్స్, గోవింద్ ఇంగ్లీష్,వెంకటేష్ మ్యాథ్స్ ,శివాని మ్యాథ్స్ ,శ్రీ వర్షిణి తెలుగు,అక్షిత మ్యాథ్స్ ,సుధాకర్ బాబు మ్యాథ్స్ ,నరేష్ ఇవిఎస్.ఈ యొక్క కార్యక్రమాలలో పాఠశాల ప్రధానోపాద్యాయులు మాధవి,అస్మా,విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పలుకొన్నారు.