విద్యార్థులకు సమయానుకూలంగా బస్సులు నడిపించాలి
- డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేసిన ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు అనిల్ కుమార్ గౌడ్
- విద్యార్థులు బస్సుల వలన ఎదురుకుంటున్న సమస్యలను వివరించారు
తాండూర్: నవల్గా పాఠశాల కు వచ్చే విద్యార్థులు సమయానికి బస్సులు రాకపోవడం చాల సమస్యలు ఎదురుకుంటున్నారు.ఈ యొక్క సమస్యని డిపో మేనేజర్ గారి దృష్టికి తీసుకెళ్లారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు అనిల్ కుమార్.విద్యార్థుల సౌకర్యార్థంగా తాండూర్ నుంచి నీళ్లపల్లి వరకు ప్రత్యేక బస్సును నడిపించాలని కోరుతూ ఎన్ ఎస్ యుఐ జిల్లా నాయకులు అనిల్ కుమార్ గౌడ్, నవల్గా జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ లు తాండూర్ డిపో మేనేజర్ రాజశేఖర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బషీరాబాద్ మండల పరిధిలోని నవల్గా ఉన్నత పాఠశాలలో 383 మంది విద్యార్థులు పలు గ్రామాల నుంచి వచ్చి విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులకు సమయాను కూలంగా ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సు నడిపించాలని పెర్కొన్నారు. మండల పరిధిలోని పర్వత్ పల్లి ,మర్పల్లి, నీలపల్లి తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులకు సమయాను కూలంగా బస్సులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు సమయానుకూలంగా బస్సులు నడిపించాలని, సాయంత్రం నవల్గా నుంచి నీళ్లపల్లి వరకూ బస్సును నడిపించాలని డిపో మేనేజర్ కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
బషీరాబాద్ మండలంలో ఎక్సప్రెస్ రైలు ఆపాలని విన్నపం
- సికింద్రాబాద్ జనరల్ మేనేజర్ ని కలసిన బషీరాబాద్ మండల ప్రజలు
బషీరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా కు సికింద్రాబాద్ నుంచి పర్యవేక్షణ నిమిత్తం వికారాబాద్, తాండూర్, నవంద్గి మరియు వాడి వరకు ప్రయాణం చేశారు.ఇందులో భాగంగా తాండూర్ పట్టణంలో రైల్వేస్టేషన్లో తనిఖీలు నిర్వహించరు.ఈ సందర్బంగా బషీరాబాద్ మండల తరుపున నుండి జయరమా చారి ఆర్ఎంపీ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ నరేష్ చవాన్ ప్రజలు ఎదురుకుంటున్న ట్రైన్ సమస్యలను వివరించి,దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా కు వినతి పత్రాన్ని అందజేశారు. 10 ఎండ్లు నుండి రైలు సమయానుకూలంగా లేకపోవడని మరియు ఎక్సప్రెస్ రైలు బషీరాబాద్ మండలంలో నిలవాలని కొనియాడారు. ఇప్పడికైనా కనికరించి బషీరాబాద్ మండల ప్రజల బాధలు తీర్చండి అని వ్యక్తం చేశారు. ఈ యొక్క కార్యక్రమాలలో జయరమా చారి ఆర్ఎంపీ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ నరేష్ చవాన్, రాఘవేంద్ర చారి వివేకానంద యూత్ ప్రజలు తదితరులు పాల్కొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదవాళ్లకు అండ
హైదరాబాద్ : హైదరాబాద్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి 80,000 వేల చెక్కు అందజేశారు. పెద్దేముల్ మండలం మారేపల్లి తాండకు చెందిన హన్మంతు ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతునాడు. వారి కుటుంబ సభ్యులు తాండూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంప్రదించగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి హన్మంతు చికిత్సకు మంజూరైన రూ.80,000/- వేల విలువైన ఎల్ఓసీని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
Good anna
ReplyDeleteJai Telangana
ReplyDelete