ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం డిసెంబర్ 14న ఛలో ఢిల్లీ
- మాదిగ విద్యార్థి జాతీయ మహాసభను విజయవంతం చేయండి
- ఎంఎస్ఎఫ్ వికారాబాద్ జిల్లా ఇంఛార్జి మల్లికార్జున్ మాదిగ
- మండల ఇంఛార్జి బీ.కృష్ణ మాదిగ
బషీరాబాద్ : ఎస్సీ వర్గీకరణ కోసం ఈ నెల 14న ఢిల్లీలో జరుగు సభను విజయవంతం చేయాలనీ ప్రజా సంఘాల అధ్యక్షులు కోరారు. బషీరాబాద్ మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ చెట్టబద్దత కోసం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టీ ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకించలని డిమాండ్ తో ఎమ్మార్పీయస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అదేశలా మేరకు ఎమ్ఎస్ఎఫ్ వికారాబాద్ జిల్లా ఇంఛార్జి మల్లికార్జున్ మాదిగ ,బషీరాబాద్ మండల ఇంఛార్జి బీ. కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్పిఎస్ ఆఫీస్ లో ఛలో ఢిల్లీ కరపత్రన్ని ఆవిష్కరించి డిసెంబర్ 14న ఢిల్లీలో జరుగుసభను విజయంతం చేయాలని మాదిగ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కిష్టప్ప మాదిగ నర్సింలు మాదిగ విద్యార్థులు జైరామ్ మాదిగ వెంకట్ శ్రీను ప్రకాష్ పాల్గొన్నారు.
పది రోజులలో రైతు బంధు అమలు
తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రైతులకు పదిరోజుల్లో రైతు బంధు సాయాన్ని అందించాలని నిర్ణయించారు. యాసంగి సీజన్ పంటల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతు బంధు నిధులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు ఏకంగా 7,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వానాకాలం సీజన్‌కు సంబంధించి జూన్ నెలలో 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయంగా రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.47 కోటి ఎకరాలకు నిధుల పంపిణీ జరిగింది. అయితే ఈ యాసంగి సీజన్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకు అనుగుణంగా భూవిస్తీర్ణం పెరిగితే బడ్జెట్ కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలోనే సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు పంపిణీ చేయడానికి రూ.7,500 కోట్లు అవసరముంటుందని వ్యవసాయ, ఆర్థిక శాఖలు అంచనా వేశాయి. డిసెంబర్ 15 నుంచి అంటే మరో పది రోజుల్లోనే తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయాలని కోరరు.రైతు బంధు ఈ 10 రోజులలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు.