రేపటినుండి తెరుచుకోనున్న పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభం
తాండూర్ : తాండూర్ పట్టణంలో అంతరం రోడ్డు మార్గంలోని పాల శీతలీకరణ కేంద్రంని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు.ఎన్నో ఎండ్లుగా నామ మాత్రంగా పనిచేస్తూ రెండు సంవత్సరాలుగా పూర్తిగా మూతపడిన కేంద్రం. శనివారం రోజున శీతలీకరణ కేంద్రంని సందర్శించి రేపటి నుండి ప్రారంభం కావడంతో దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అని తెలిపారు. పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నడడం చూసి రైతులకు అన్ని రకాలుగా అండగా ఉండలని కోరారు.పలుమార్లు మదర్ డయిరీ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే, తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.గత వారం కేంద్రాన్ని పరిశీలించిన మదర్ డెయిరీ అధికారులు, చిన్న చిన్న మరమ్మతుల అనంతరం రేపటినుండి పునర్ ప్రారంభంకానున్న పాల శీతలీకరణ కేంద్రం.రైతులు పాల శీతలీకరణ కేంద్రంని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.