Type Here to Get Search Results !

Sports Ad

తాండూర్ పట్టణంలో ఆరు నెలలో రోడ్లు అభివృధి చేస్తా

 

 తాండూర్ పట్టణంలో ఆరు నెలలో రోడ్లు అభివృధి చేస్తా

  • డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తాండూర్ బంద్ రిలే దీక్షలతో ఆందోలన
  • ఇందిరా చౌరస్తాలో ఆందోళన కారులతో ఎమ్యల్యే
  • తాండూర్ పట్టణంలో రోడ్లు,త్రాగు నీరు,విద్య,వైద్య రంగాలలో ఉన్న సమస్యలను వచ్చే  ఆరు నెలలో అభివృధి పూర్తి చేస్తామని హామీ 

తాండూర్ : తాండూర్ పట్టణ ప్రాంతంలో రోడ్ల అభివృధికి కృషి చేస్తామని ఇందు కోసం నిధులను తీసుకురావడం జరుగుతుంది అని తెలిపారు.వచ్చే వానకాలంలోపు రోడ్లను అభివృధి చేస్తామన్నారు.అప్పటి వరకు రోడ్లపై దుమ్ము ధూళి లేవకుండా మున్సిపల్ నుండి ప్రతి రోజు మూడు సార్లు నీళ్లు చల్లే ఏర్పాట్లు చేయాలనీ అధికారులకు ఆదేశించారు.

అదేవిదంగా త్వరలో ఇండస్ట్రియల్ పార్కులను పూర్తి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు.నమ్మకాని వమ్ము చేయను వచ్చే ఆరు నెలలో రోడ్లు అభివృధి చేస్తా దుమ్ము లేకుండా రోడ్లపై నీళ్లు నిలిచేలా ఏర్పాటు తాండూర్ ప్రజలు తన పై పెట్టుకున్ననమ్మకాన్ని వమ్ము చేయకుండా వచ్చే ఆరునెలల్లో రోడ్ల  అభివృధి ,దుమ్ము ధూళి నియంత్రణకు కృషి చేస్తానని ఎమ్యల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.తాండూర్ రోడ్ల కాలుష్యం మెడికల్ కళాశాల డిమాండ్లతో తాండూర్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తాండూర్ బంద్ రిలే దీక్షలతో ఆందోలన చేపట్టారు.ఇందిరా చౌరస్తాలో ఆందోళన కారులతో ఎమ్యల్యే మాట్లాడారు.



 లీకేజీ అయినా తాగునీటి పైప్ లైన్ పరిశీలిస్తున్న MLA

కాగ్నా నది నీళ్లు తాగితే ఇబ్బందులు ఎదురౌతున్నాయి అని మొన్న పాత తాండూరులో తాగునీటి పైప్ లైన్ లీకేజీతో కలుషిత నీరు తాగి కొంతమంది అస్వస్థతకు గురి కాగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు పైప్ లైన్ మరమత్తులు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కాగా కాగ్న నది నుండి వచ్చే పైప్ లైన్ 4,5 చోట్ల లీకేజిఅవ్తునట్లు అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు ఈరోజు పాత తాండూరు -కాగ్న వాగు మార్గంలో మరమత్తు పనులను పరిశీలిచారు. రేపటిలోపు పనులు పూర్తి చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. మరోవైపు  పాత తాండూరు తెలుగుగడ్డలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే సందర్శించారు. అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు అంబులెన్స్ ను అక్కడే ఉంచాలని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ను ఎమ్మెల్యే ఆదేశించారు.మెడికల్ కళాశాలను ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామన్నారు.తాండూర్ పట్టణంలో రోడ్లు,త్రాగు నీరు,విద్య,వైద్య రంగాలలో ఉన్న సమస్యలను వచ్చే  ఆరు నెలలో అభివృధి పూర్తి చేస్తామని పేర్కొన్నారు.ఈ యొక్క కార్యక్రమాలలో తెరాస సీనియర్ నాయకులు,ప్రజా ప్రతినిధులు,ప్రజా సంఘలు తదితరులు పలుకున్నారు. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies