బషీరాబాద్ మండల కేంద్రంలో దివ్యంగుల దినోత్సవం
- ట్రై సైకిళ్లను పంపణీ చేసిన సర్పంచ్ ప్రియాంక శ్రవణ్
- రెవిన్యూ, మండల అధికారులు, గ్రామస్తులు
బషీరాబాద్ : బషీరాబాద్ మండల కేంద్రంలో దివ్యంగుల దినోత్సవని సందర్బంగా శుక్రవారం రోజున వికలాంగులకు ట్రై సైకిలను పంపిణి చేసి ఘనంగా జరుపుకున్నారు. దివ్యంగులకు ఆసరాగా ఉండేందుకై ఐకెపి నిధులతో ట్రై సైకిలను అందజేసేందుకు మండల కేంద్రంలో స్త్రీశక్తి భవన్ కార్యాలయంలో తెలంగాణ సమగ్ర శిక్ష మరియు దివ్యంగుల దినోత్సవం సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాలలో వికలాంగులకు గ్రామ సర్పంచ్ ప్రియాంక సైకిళ్లను రిబేన్ కటింగ్ తో ప్రారంభించి వికలాంగులైన వీరికి సైకిళ్లను అందజేశారు.అదేవిదంగా కొంత మందికి బహుమతులు అందజేశారు.ఈ సమావేశంలో రెవిన్యూ, మండల అధికారులు ఎంఆర్ఓ వెంకటస్వామి,ఎంపిడిఓ రమేష్,ఎంఈఓ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వికలాంగులను ఏలన చేయదని మనతో సమానంగా చూసుకోవాలని కోరారు.
దివ్యంగులకు కూడా విద్య,వైద్య,క్రీడ రంగాలలో ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలని కోరారు.వికలాంగుల కోసం కేటహించిన రిజర్వేషనులను అమలు చేయాడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమాలలో ఎంఆర్ఓ వెంకటస్వామి,ఎంపిడిఓ రమేష్,ఎంఈఓ సుధాకర్ రెడ్డి,ఎపిఓ,గ్రామ సర్పంచ్ ప్రియాంక,తెరాస సీనియర్ నాయకులు రాజ రత్నం,ఎమ్మార్సీ సిబ్బంది కమల్ ప్రసాద్,సోయల్,చంద్రకళ,రెవిన్యూ, మండల అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్కొన్నారు .
బషీరాబాద్ లో వరి కొనుకోలు ప్రారంభం
బషీరాబాద్ : బషీరాబాద్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు కోపరేటివ్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి,సర్పంచ్ ప్రియాంక శ్రవణ్ ప్రారంభించారు.
వీరు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన వారి ధాన్యాన్ని మద్దతు ధరకు కొంటామని అన్నారు.ఎ గ్రేడ్ కు రూ. 1960/- బి గ్రేడ్ కు రూ 1940/- అదేవిదంగా తేమ శాతం సరిగ్గా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమాలలో మార్కెట్ కమిటీ సెక్రెటరీ లక్ష్మయ్య,సీనియర్ నాయకులు రాజ రత్నం,పండు,వెంకయ్య, శ్రవణ్ కుమార్ రైతులు తదితరులు పలుకున్నారు.
బస్సుల సమస్యలపై చర్చించిన,ఆర్టీసీ డిపో చైర్మన్
- తాండూరు ఆర్టీసీ డిపో సమస్యలపై చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు : తాండూరు పట్టణంలో ఆర్టీసీ డిపోకు అదనపు బస్సులు కావాలని, డిపో లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈరోజు శుక్రవారం కలిసి చర్చించారు . హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లి మాట్లాడడం జరిగింది. సమయానుకూలంగా అదనపు బస్సులు ఉంటేనే ప్రయాణికులకు, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయని ఆయన వివరించారు. బస్సుల విషయమై చైర్మన్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి కొత్త బస్సులు వచ్చిన వెంటనే తాండూరుకు మరిన్ని బస్సులు కేటాయించి సమస్యను పరిష్కరిస్తానని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి హామీ ఇచ్చారు. అప్పటి వరకు అధికారులతో మాట్లాడి ఉన్న బస్సులను సమయానుకూలంగా నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ తదితరులు పలుకున్నారు.